వెయ్యి కోట్ల సినిమాకు అప్పుడే కష్టాలు...
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియన్ సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లు కూడా క్రాస్ చేయని తరుణంలో `మహాభారతం` సినిమాను వెయ్యి కోట్లతో నిర్మిస్తామని ప్రకటించగానే అందరూ షాకయ్యారు. నాలుగేళ్ళ ప్రాజెక్ట్. ఇటు బాలీవుడ్, అటు దక్షిణాది హీరోలు అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. ప్రముఖ రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత ఎం.టి.రాందేవ్ నాయర్ రచించిన `రాందమూళం` ఆధారంగా మహాభారతం సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భీముడిగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించబోతున్నాడు. కర్ణుడిగా నటించమని యూనిట్ వారు సంప్రదించారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా సెట్స్‌లోకి వెళ్ళని ఈ సినిమాకు మహాభారతం అని పేరు పెడితే ఒప్పుకోబోమని కేరళకు చెందిన హిందూ ఐక్య వేదిక హెచ్చరింది. ఆ సంఘం అధ్యక్షురాలు శశికళ, రాందమూలం నవల ఆధారంగా సినిమా రూపొందనున్నప్పుడు ఆ టైటిల్‌నే పెట్టుకోవాలే తప్ప మహాభారతం అనే టైటిల్‌ను ఎందుకు పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ హెచ్చిరికను పట్టించుకోకుండా మహాభారతం అనే టైటిల్ పెడితే సినిమాను థియేటర్స్‌లో విడుదల కానివ్వమన్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను యు.ఎ.ఇకి చెందిన బి.ఆర్.శెట్టి నిర్మాతగా వి.ఎ.కుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments