Galata Geethu : నాగార్జునతో గీతూ పాప... మళ్లీ హౌస్‌లోకి రీ ఎంట్రీనా, పింకీ పంచ్ పడిందిగా..!!

  • IndiaGlitz, [Tuesday,November 29 2022]

బిగ్‌బాస్ 6 తెలుగు ముగింపు దశకు వచ్చేసింది. విజయవంతంగా 13వ వారంలోకి ప్రవేశించింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వుండటంతో ఫైమా సేవ్ అవ్వగా.. రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా రాజ్ బలయ్యాడు. అయితే దీనిని బట్టి రేవంత్‌ని విన్నర్‌ని చేయడానికే అతనిని బలి చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వారం గడిస్తే టాప్ 5లో ఎవరెవరు వుంటారో ఓ క్లారిటీ రానుంది. ఇకపోతే.. టాప్ 5లో ఖచ్చితంగా వుంటుందని అంతా భావించిన గలాటా గీతూ ఓవరాక్షన్ కారణంగా 9వ వారమే బయటకు వెళ్లిపోయింది. అప్పుడు ఆమె చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. తనకు గెలవాలని వుందని, ఇంటిలోనే వుంటానని చెప్పింది. కానీ అది తన చేతుల్లో లేదని, ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలని నాగార్జున చేతులేత్తేశాడు.

నాగార్జునతో గీతూ ఫోటో వైరల్:

హౌస్‌ నుంచి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం తన పనుల్లో తాను మునిగిపోయింది గీతూ. అలాగే ఎప్పటికప్పుడు బిగ్‌బాస్‌కు సంబంధించిన విశేషాలు పంచుకుంటూ వుంటోంది. తాజాగా ఆమె హోస్ట్‌ నాగార్జునను కలిసిన ఫోటోనే షేర్ చేసింది. ఈ సందర్భంగా గీతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘‘ మీరు ఎప్పుడూ మద్ధతుగా నిలిచారు సార్.. నేను మీకు ఎప్పటికీ రుణపడి వుంటాను... థ్యాంక్స్ సార్’’ అని కింగ్ గురించి రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే 8 కేజీలు తగ్గా.. ఇక నా వల్ల కాదబ్బా :

నిజానికి గీతూ బయట వుండటం వల్ల తమకు మజా వుండటం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తనదైన స్ట్రాటజీలు వాడి ఎలాగైనా గెలిచే సత్తా గీతూ సొంతం. కొందరు ఆమెను ఈ విషయంలో తిట్టుకున్నప్పటికీ.. గీతూ లేని లోటు మాత్రం కొట్టాచ్చినట్లు కనిపిస్తోందన్నది మాత్రం వాస్తవం. అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యాక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని రకరకాలుగా కథనాలు వచ్చాయి. కానీ బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి మాత్రం ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. తాజాగా బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ పింకీ పెట్టిన పోస్ట్ మాత్రం గీతూ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ‘‘తగ్గేదే లే’’ అంటూ పింకీ పెట్టిన పోస్టుకు గీతూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చింది. ప్రస్తుతం 8 కేజీలు తగ్గానంటూ పంచ్ ఇచ్చింది.