మహబూబ్‌నగర్ జైలుకు వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య కేసు నిందితులు

  • IndiaGlitz, [Saturday,November 30 2019]

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వారికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా.. ఈ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిన్నటి నుంచే షాద్ నగర్‌ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలు నిరసనకారులు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో నిందితులను బయటికి తీసుకురావడం.. కష్టం పైగా సురక్షితం కాదని భావించిన పోలీసులు.. ఇవాళ కోర్టుకు తరలించాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లలేక మేజిస్ట్రేట్‌నే స్టేషన్‌కు తీసుకొచ్చి కేసును విచారించారు. ఈ క్రమంలో ఆ నలుగురు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం ఆ ఆందోళన మధ్యనే మేజిస్ట్రేట్ స్టేషన్‌ నుంచి భారీ భద్రత మధ్య వెళ్లారు. కాగా.. మేజిస్ట్రేట్ తీర్పు మేరకు నిందితులను రిమాండ్‌కు గాను షాద్ నగర్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించబోతున్నారు. సో ఇవాళే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది.. మరి మహబూబ్‌నగర్‌కు తరలించేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

More News

'చీమ - ప్రేమ మధ్యలో భామ!' ఆడియో లాంచ్‌

సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది!

దుమ్ము రేపుతున్న 'దర్బార్'లో 'దుమ్ము ధూళి' పాట - పాటల రచయిత అనంత శ్రీరామ్

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా 'గజిని', 'స్టాలిన్', 'తుపాకీ' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో

ఆ డైరెక్ట‌ర్‌తో నాని మ‌రోసారి.. హీరోయిన్ ఫిక్స్‌

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'వీరశాస్త అయ్యప్ప కటాక్షం' ఆడియో ఆవిష్కారం!

'100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్' సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్నభక్తి రస ప్రధాన చిత్రం 'వీరశాస్త అయ్యప్ప కటాక్షం'.

మోక్ష‌జ్ఞ రీసెంట్ ఫొటోతో నంద‌మూరి అభిమానులు షాక్‌!

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.