మహబూబ్‌నగర్ జైలుకు వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య కేసు నిందితులు
Send us your feedback to audioarticles@vaarta.com
వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వారికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పాండునాయక్ 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా.. ఈ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో నిన్నటి నుంచే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద వేల సంఖ్యలు నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో నిందితులను బయటికి తీసుకురావడం.. కష్టం పైగా సురక్షితం కాదని భావించిన పోలీసులు.. ఇవాళ కోర్టుకు తరలించాల్సి ఉండగా.. అక్కడికి వెళ్లలేక మేజిస్ట్రేట్‌నే స్టేషన్‌కు తీసుకొచ్చి కేసును విచారించారు. ఈ క్రమంలో ఆ నలుగురు నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం ఆ ఆందోళన మధ్యనే మేజిస్ట్రేట్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య వెళ్లారు. కాగా.. మేజిస్ట్రేట్ తీర్పు మేరకు నిందితులను రిమాండ్‌కు గాను షాద్ నగర్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా జైలుకు పోలీసులు తరలించబోతున్నారు. సో ఇవాళే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం.. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది.. మరి మహబూబ్‌నగర్‌కు తరలించేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout