Bigg Boss Telugu 7 : గౌతమ్‌ను చంపలేకపోయిన శివాజీ.. కిల్లర్‌గా ప్రియాంక, శోభాశెట్టి కోసం తొండాట
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఉత్కంఠగా సాగుతున్న సంగతి తెలిసిందే. మిసెస్ బిగ్‌బాస్ దారుణ హత్యకు గురికావడంతో ఆమెను చంపింది ఎవరో తెలుసుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు. కిల్లర్‌ను కనిపెట్టాల్సిందిగా అర్జున్ అంబటి, అతనికి అసిస్టెంట్‌గా అమర్‌ను పోలీసులుగా చేస్తూ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మిసెస్ బిగ్‌బాస్ వైఫ్‌కు చెఫ్‌గా ప్రశాంత్.. మేనేజర్‌గా శివాజీ, బట్లర్స్‌గా ప్రియాంక, యావర్.. దోబీగా గౌతమ్.. రతికలు సీక్రెట్ లవర్స్‌గా .. ఈ హత్య కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి శోభా, అశ్వినీలు జర్నలిస్టులుగా వ్యవహరించాలని బిగ్‌బాస్ ఆదేశించారు.
హౌస్‌లో పల్లవి ప్రశాంత్‌ను చంపాల్సిందిగా టాస్క్ ఇవ్వడంతో శివాజీ ఆ పని పూర్తి చేశాడు. స్టోర్ రూమ్‌లో అతను దెయ్యంగా కనిపించడంతో ఇంటి సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ అశ్వినిని చంపాల్సిందిగా బిగ్‌బాస్ శివాజీని ఆదేశించాడు. అద్దంపై ‘ క్రై బేబీ అశ్విని గెట్ ఔట్’’ అని రాస్తే ఆమె చనిపోతుందని చెబుతాడు. శివాజీ ఈ పని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ప్రశాంత్‌తో పాటు అశ్విని కూడా దెయ్యంగా మారిపోయింది. ఇద్దరు హౌస్మేట్స్ చనిపోవడంతో అర్జున్, అమర్‌దీప్‌లు ఇన్వెస్టిగేషన్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నారు. శివాజీని విచారించాలని నిర్ణయించుకుని అతనిని పక్కకు పిలిచి.. కన్ఫెషన్ రూమ్‌లో బిగ్‌బాస్ మీకు ఏం చెప్పారు అని ప్రశ్నించారు. ఆ తర్వాత మిగిలిన వారిని కూడా ఎంక్వైరీ చేశారు.
ఆ వెంటనే గౌతమ్‌ను చంపాల్సిందిగా శివాజీని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీనిలో భాగంగా అతనికి ఓ స్టిక్కర్ అతికిస్తే చనిపోతాడని చెబుతాడు. కానీ ఇచ్చిన టైంలోగా శివాజీ ఆ పని చేయలేకపోవడంతో బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంటెస్టెంట్స్‌ని చంపే పనిని ప్రియాంకకి అప్పగించాల్సిందిగా ఆదేశించాడు. దీంతో శివాజీ వెళ్లి ప్రియాంకకు టాస్క్‌ల గురించి వివరించి, తనకు బిగ్‌బాస్ ఇచ్చిన ఫోన్‌ను ఆమెకు అందించాడు. గౌతమ్‌పై డెడ్ అనే స్టిక్కర్‌ను అతికించి అతనిని చంపాలని బిగ్‌బాస్ ఆమెను ఆదేశించగా..అతని మైక్‌పై ఆ స్టిక్కర్‌ను అతికించి తొలి మర్డర్‌ను సక్సెస్‌ఫుల్‌గా చేసింది. అనంతరం బాత్రూమ్ హ్యాండ్ వాష్‌లో టీ పోయమని ప్రియాంకను ఆదేశించాడు బిగ్‌బాస్. ఆ హ్యాండ్ వాష్‌ను ఎవరు ఫస్ట్ వాడితే వారు చనిపోతారని చెప్పాడు.
అయితే తన ఫ్రెండ్ శోభాశెట్టికి ఈ విషయం ముందుగానే చెప్పి ఆమెను కాపాడింది. కాసేపటికి ప్రిన్స్ యావర్ వాష్‌రూమ్‌లో టీ వున్న హ్యాండ్ వాష్‌ను ఉపయోగించి చనిపోయాడు. ఇంట్లో వరుస పెట్టి మర్డర్లు జరుగుతూ వుండటంతో అర్జున్, అంబటిలు రతికను అనుమానించి జైల్లో పెడతారు. అయినప్పటికీ మరో హత్య జరగడంతో శివాజీపై వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆయన బాత్రూంలో దాక్కొని , కాసేపటి తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. కానీ ఇంట్లో మరో హంతకుడు వున్నాడని భావించిన అమర్, అర్జున్‌లు ప్రియాంకపై అనుమానం వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారంటూ అమర్, అర్జున్‌లను బిగ్‌బాస్ ప్రశంసించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments