Bigg Boss 7 Telugu : అమ్మాయిల మైండ్ గేమ్‌కు బలైన ప్రిన్స్ .. శోభా, ప్రియాంకల బుల్ ఫైట్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7లో మూడో పవర్ అస్త్ర కోసం ఉత్కంఠభరితంగా పోటీ జరుగుతోంది. ఈ వారం ప్రారంభంలో మూడో పవర్ అస్త్ర కోసం ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, అమర్‌దీప్‌లను కంటెండర్లుగా సెలక్ట్ చేశాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో వారు అర్హులా కాదా అని నిర్ణయించడానికి పెట్టిన టెస్టుల్లో ప్రిన్స్ యావర్, శోభాశెట్టి తమను తాము నిరూపించుకోగా.. అమర్దీప్ మాత్రం జుట్టు కట్ చేసుకోవడానికి భయపడ్డాడు. దీంతో అతని ప్లేస్‌లో ప్రియాంక జైన్ వచ్చింది. వీరు ముగ్గురిలో మూడో పవర్ అస్త్రను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
మూడో పవర్ అస్త్ర కోసం టాస్క్ మొదలెట్టాడు బిగ్‌బాస్. పోటీలో వున్న ముగ్గురిలో ఎవరు అనర్హులో వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో ప్రిన్స్, శోభా, ప్రియాంకల మధ్య డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలో శోభా శెట్టి.. ప్రిన్స్‌ని, యువర్.. శోభాని చెప్పారు. దీంతో వీరిద్దరికీ పెద్ద గొడవ జరిగింది. ఇక ప్రియాంక శోభా పేరు చెప్పి .. టేబుల్‌పై వున్న ప్రిన్స్ యావర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో పగులగొట్టారు. తనను పక్కకు తప్పించడం పట్ల ప్రిన్స్ యావర్ తట్టుకోలేకపోయాడు. కోపంతో సుత్తి తీసుకుని బల్లని విరగ్గొట్టాడు.
నేను, ప్రియాంక పోటీపడితే అది సమానంగా వుంటుందని, అదే బలమైన యావర్ సీన్లో వుంటే కచ్చితంగా అతనే గెలుస్తాడని శోభా శెట్టి చెప్పింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ పగులగొట్టినందుకు సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అమ్మాయిలిద్దరూ కలిసి తనను తప్పించినందుకు ప్రిన్స్ కుమిలి కుమిలి ఏడ్చాడు. శివాజీ దగ్గర కూర్చొని తన కష్టాలు, బాధలు చెప్పుకొచ్చాడు. తనకు జాబ్ లేదని, జేబులో రూ.100 కూడా లేని రోజులు వున్నాయని గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్‌లోకి రావడానికి ముందు తన ఖాతాలో డబ్బులు లేవని దీంతో లోన్ తీసుకున్నానని, అన్నయ్యే షూస్ ఇచ్చాడని.. బట్టలు కూడా ఎక్కువ అడగలేనని ప్రిన్స్ తెలిపాడు. దీనికి బాగా ఎమోషనలైన శివాజీ.. ప్రిన్స్‌ని ఓదార్చాడు.
చివరికి కంటెండర్లుగా మిగిలిన శోభ, ప్రియాంకల మధ్య బిగ్‌బాస్ బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఎలక్ట్రికల్ బుల్‌పై ఎక్కువసేపు ఎవరైతే వుంటారో వాళ్లు విజయం సాధించినట్లని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌లో స్మార్ట్‌గా ఆలోచించిన ప్రియాంక.. బుల్‌పై తాడుని పట్టుకుని దానిపై పడుకుంది. మూడు రౌండ్లలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది. శోభా మాత్రం కూర్చొన్న పొజిషన్లో వుండి.. బుల్ కదులుతుంటే భయపడిపోయింది. దీంతో ఆమె తక్కువ సేపే బుల్‌పై వున్నట్లుగా అనిపించింది. అయితే ప్రియాంక, శోభలలో పవర్ అస్త్రను గెలుచుకున్న విజేత ఎవరు అన్నది నాగార్జున రేపు అనౌన్స్ చేయనున్నారు.
రేపు శనివారం కావడంతో నాగార్జున రానున్నారు. ఇకపోతే.. వారం నామినేషన్స్ లో అమర్ దీప్, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్, రతిక, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments