నరేంద్ర మోదీపై ప్రియాంకా గాంధీ పోటీ!?
Send us your feedback to audioarticles@vaarta.com
యావత్ భారత్ వ్యాప్తంగా నరేంద్ర మోదీ హవాను తట్టుకునేందుకు గాను కాంగ్రెస్ పెద్దలు ప్రియాంక గాంధీని రంగంలోకి దింపిన విషయం విదితమే. ప్రియాంక వస్తే ఇందిరాగాంధీ నాటి పాత రోజులు వస్తాయని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. కాగా గాంధీ ఫ్యామిలీకి లేడీస్ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నది.. దీంతో సేమ్ టూ సేమ్ నానమ్మ అచ్చుదింపిన ప్రియాంకను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారంలో ప్రియాంక దూసుకెళ్తున్నారు.
ఇక విషయానికొస్తే.. ఎవరినైతే ఢీ కొనడానికి ప్రియాంకను రంగంలోకి తెచ్చారో.. ఆయనపైనే ప్రియాంకను పోటీ చేయించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే నరేంద్ర మోదీ వర్సెస్ ప్రియాంకా గాంధీ అన్న మాట. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారం చేస్తుండగా ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులు.. మీరు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. ఇందుకు బదులిచ్చిన ఆమె.. ‘ఏం వారణాసిని పోటీ చేయొద్దా’ అంటూ కార్యకర్తలను ఎదురు ప్రశ్నించారు. చెప్పండి మరి.. వారణాసీ నుంచి పోటీ చేయాలా వద్దా..? అని మళ్లీ నవ్వుతూ ప్రియాంక కార్యకర్తలను అడగ్గా.. మీ ఇష్టం మేడం ఎక్కడ్నుంచైనా సరే పోటీ చేయండి అని ఆమెకు చెప్పారు.
కార్యకర్తలు అడగ్గానే మొట్టమొదట వారణాసి నియోజకవర్గం పేరే రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొడితే కొండనే కొట్టాలన్నట్లుగా ఏకంగా మోదీనే కొట్టాలని ప్రియాంక చూస్తున్నారని సోషల్ మీడియాలో.. టీవీ చానెళ్లలో వరుస కథనాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే మోదీ-ప్రియాంక బరిలోకి దిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది ఊహించలేం. అయితే అసలు ఈ ఇద్దరు పోటీ చేసే అవకాశాలున్నాయా..? లేకుంటే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందా..? అనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout