5రోజులు.. 4 కోట్లు
- IndiaGlitz, [Tuesday,November 27 2018]
అమెరికా సింగర్ నిక్ జోనస్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాల వివాహం డిసెంబర్ 2, 3 తేదీల్లో ఘనంగా జరగనుంది. పెళ్లికి ముందు తంతు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతుంది. రాజస్థాన్‌లో ఉమైద్ భవన్ ప్యాలెస్ వివాహ వేడుక జరగనుంది. ప్రీ వెడ్డింగ్‌లో మెహందీ, సంగీత్ తదితర వేడుకల్ని ఈ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు.
ఈ ప్యాలెస్‌లో మొత్తం 64 గదులుంటాయి. అందులో కొన్ని సాధారణ గదులకు రోజుకు రూ.43,500.. హిస్టారికల్ గదులకు రూ.65,300.. రాయల్ గదులకు రూ.1.45లక్షలు.. గ్రాండ్ రాయల్ గదులకు రూ.2.30లక్షలు.. ప్రెసిడెన్స్ గదులకు రూ5.04 లక్షలు.. అంటే రోజుకు అద్దెకు రూ.64.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఆ లెక్కలో ఐదు రోజులకు 3.2 కోట్ల రూపాయలకు... ఇంకా వేదికను అలంకరించడానికి, విందుకు ఇలా అన్నింటికీ కలిసి అదనంగా రూ.73 లక్షలు ఖర్చు అవుతాయట. అంటే మొత్తంగా రూ.4 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ లెక్కలో ఐదు రోజులకు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రియాంక.