అచ్చం సమంత దారిలోనే ప్రియాంక చోప్రా.. ఇన్‌స్టా ఖాతాలో భర్త పేరు తొలగింపు, దాని అర్థమేంటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా వెలుగొందుతున్నారు ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్. తన కంటే వయసులో దాదాపు పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను 2018లో పెళ్లాడారు ప్రియాంక చోప్రా. అమెరికా- ఇండియాల మధ్య చక్కర్లు కొడుతూ వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలు, సినిమాలు ఇతర ఈవెంట్‌లకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేవారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ కపుల్‌కి సంబంధించిన ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక తన భర్త నిక్ నుంచి విడిపోతున్నారా ... అన్నదే ఆ వార్త సారాంశం. దీంతో నెటిజన్లు, అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రోఫైల్ పేరు నుంచి భర్త నిక్ జోనస్ పేరును తొలిగించింది. అది చూసి ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ అంతా షాక్‌కు గురవుతున్నారు.
అసలేం జరిగింది, నిక్ పేరును ప్రియాంక ఎందుకు తొలగించారంటూ బాలీవుడ్, హాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా ఇటీవల టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య-సమంతలు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వారి విడాకుల ప్రకటనకు రెండు మూడు నెలల ముందు సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరుకుముందు అక్కినేని అన్న పదాన్ని తొలగించి కేవలం ఎస్ అనే అక్షరం మాత్రమే ఉంచింది. దీంతో ఈ జంట విడిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు రావడం చివరికి అదే నిజం కావడం చకచకా జరిగిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రియాంక కూడా తన సోషల్ మీడియా ఖాతాల పేర్లను మార్చడంతో ప్రియంక-నిక్‌కు మధ్య కూడా సంబంధం చేడిందా..? అంటూ ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి.
అయితే ఈ వార్తపై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించారు. వారి బ్రేకప్ వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఈ వార్తలపై ప్రియాంక చోప్రా స్నేహితురాలు కూడా స్పందించారు. అవన్నీ పుకార్లు మాత్రమే అని, వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రియాంక భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రాజెక్ట్‌ల కోసమే తన పేరును ఇలా మార్చుకున్నారని ఆమె క్లారిటీ ఇచ్చారు. మరి ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడాలంటే స్వయంగా ప్రియాంకనే స్పందించాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments