ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రియాంక చోప్రా..
- IndiaGlitz, [Monday,April 04 2016]
అందం - అభినయం తో పాటు ఆత్మవిశ్వాసాని మరో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మహత్యకు ప్రయత్నించిందా..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందట ప్రియాంక. ఈ విషయాన్ని ఆమె మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు తెలియచేసారు. ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య నేపధ్యంలో ప్రకాష్ జాజు ప్రియాంక చోప్రా ఆత్యహత్యకు ప్రయత్నించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రియాంక మాజీ బాయ్ ఫ్రెండ్ అసీమ్ మర్చంట్ తల్లి చనిపోయినప్పుడు మనస్తాపానికి గురై ప్రియాంక చనిపోవాలనుకుందని చెప్పారు. అసిమ్, ప్రియాంక రోజూ గొడవ పడేవారని...ఈ గొడవల వలన ప్రియాంక మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యిందన్నారు. ఒక రోజు ప్రియాంక ఇంటి కారిడార్ నుంచి దూకి చనిపోవాలనుకున్నప్పుడు తనే కాపాడానన్నారు. అర్ధరాత్రి ఫోన్ చేసి ఏడ్చేదని జాజు తెలిపారు. మరి..ఎప్పుడో జరిగిన విషయాలను బయట పెట్టిన తన మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు ట్వీట్స్ పై ప్రియాంక ఎలా స్పందిస్తుందో చూడాలి.