ప్రియాంక పెళ్లి వాయిదా?

  • IndiaGlitz, [Friday,October 19 2018]

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను త‌న న‌ట‌న‌తో మెప్పించిన ప్రియాంక చోప్రా.. అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌ను వివాహం చేసుకోనుంది. రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో వీరి పెళ్లి వేడుక డిసెంబ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే ఇప్పుడు వీరి పెళ్లి వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14,15 తేదీల్లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని.. వృత్తిరీత్యా ఉన్న కార‌ణాల‌తోనే వీరి పెళ్లి వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

వీరి పెళ్లి గురించి వ‌స్తున్న వార్త‌ల‌కు ప్రియాంక చోప్రా వర్గం నుండి ఎటువంటి స్పంద‌నా రావ‌డం లేదు.