కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ నటిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. హాలీవుడ్ సింగర్ నిక్ జొనస్ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్ సినిమా రంగానికి దూరమైంది. సల్మాన్‌ఖాన్ సరసన `భారత్` వంటి సినిమాను కూడా వదులుకుంది. దీంతో ప్రియాంక బాలీవుడ్ సినిమాలను చిన్న చూపు చూస్తుందని, పట్టించుకోవడం లేదని ఇలా చాలా రకాల వార్తలు వినిపించాయి. అయితే ప్రియాంక తనకు నచ్చిన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా నటించి బాలీవుడ్ చిత్రం `ది స్కై ఈజ్ పింక్`. పలు సమస్యలను దాటుకుని 15 ఏళ్ల వయసుకే వక్తగా, రచయిత్రిగా పేరు సంపాదించుకున్న అయేషా చౌదరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది.
శుక్రవారం టోరంటో ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్లో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్, డైరెక్టర్ సోనాలి బోస్ సహా చిత్ర యూనిట్ సభ్యులు ఈ షోకు హాజరయ్యారు. ప్రీమియర్ అనంతరం వచ్చిన స్పందన చూసిన ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ సోనాలిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments