డయాబెటిస్‌తో బాధపడుతున్న ప్రియాంక కాబోయే భర్త
- IndiaGlitz, [Sunday,November 18 2018]
బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా డిసెంబర్ 2న అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే నేడు నిక్ జోనస్ ఓ షాకింగ్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. నిక్ జోనస్‌కు 13 ఏళ్ల క్రితమే టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారట. ''13 ఏళ్ల క్రితం నాలో బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోవడం వల్ల 100 పౌండ్ల బరువు కూడా తగ్గాను.
డాక్టర్లను సంప్రదిస్తే.. టైప్ 1 డయాబెటిస్ ఉందని డాక్టర్లు గుర్తించారు. అప్పటి నుండి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నాను. వర్కవుట్స్ చేస్తున్నాను. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తున్నాను. ప్రస్తుతం దీన్ని నియంత్రించ గలుగుతున్నా. దీన్ని కంట్రోల్ చేయడంలో నాకు అండగా నిలబడ్డ నా ఫ్యామిలీ సభ్యులకు, సన్నిహితులకు థాంక్స్'' అంటూ మెసేజ్ పెట్టారు నిక్ జోనస్.