డయాబెటిస్తో బాధపడుతున్న ప్రియాంక కాబోయే భర్త
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా డిసెంబర్ 2న అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. అయితే నేడు నిక్ జోనస్ ఓ షాకింగ్ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. నిక్ జోనస్‌కు 13 ఏళ్ల క్రితమే టైప్ 1 డయాబెటిస్ ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారట. ``13 ఏళ్ల క్రితం నాలో బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోవడం వల్ల 100 పౌండ్ల బరువు కూడా తగ్గాను.
డాక్టర్లను సంప్రదిస్తే.. టైప్ 1 డయాబెటిస్ ఉందని డాక్టర్లు గుర్తించారు. అప్పటి నుండి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నాను. వర్కవుట్స్ చేస్తున్నాను. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటిస్తున్నాను. ప్రస్తుతం దీన్ని నియంత్రించ గలుగుతున్నా. దీన్ని కంట్రోల్ చేయడంలో నాకు అండగా నిలబడ్డ నా ఫ్యామిలీ సభ్యులకు, సన్నిహితులకు థాంక్స్`` అంటూ మెసేజ్ పెట్టారు నిక్ జోనస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout