రహస్యంగా తల్లిదండ్రులైన ప్రియాంక- నిక్ జోడి.. అభిమానులకు షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్ దంపతులు అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. సరోగసీ విధానంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ జంట ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రియాంక-నిక్ దంపతులు సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మాకెంతో సంతోషాన్నిచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది... ఈ సమయం మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించవద్దని ప్రియాంక దంపతులు కోరారు. దీనిని చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలీవుడ్, హాలీవుడ్‌లలో మోస్ట్ లవబుల్ కపుల్‌గా వెలుగొందుతున్నారు ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్. తన కంటే వయసులో దాదాపు పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను 2018లో పెళ్లాడారు ప్రియాంక చోప్రా. వివాహమైన తర్వాత ఆమె భర్తతో కలిసి లాస్ఏంజెల్స్లో స్థిరపడింది. ప్రస్తుతం వరుస హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది.
అమెరికా- ఇండియాల మధ్య చక్కర్లు కొడుతూ వ్యక్తిగత విషయాలు, విహార యాత్రలు, సినిమాలు ఇతర ఈవెంట్లకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకునేవారు. కొద్దిరోజుల క్రితం ప్రియాంక చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ప్రోఫైల్ పేరు నుంచి భర్త నిక్ జోనస్ పేరును తొలిగించింది. అది చూసి ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ అంతా షాక్‌కు గురయ్యారు. దీనిపై విస్తృతంగా కథనాలు రావడంతో ప్రియాంక చోప్రా, ఆమె తల్లి మధు చోప్రా, నిక్ జొనాస్‌లు స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com