ప్రియాంక సజీవ దహనం: ఆ ఇద్దరిపైనే అనుమానాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్ నగర శివార్లలో డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణహత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు ఆమెపై అత్యాచారం చేసి ఆపై ఈ విషయం బయటికి పొక్కనీయకుండా సజీవ దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి పది పోలీసులు బృందాలు రంగంలోకి దిగి.. గాలిస్తున్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. అయితే ప్రియాంక రెడ్డి స్కూటీకి పంక్చర్ అయిన విషయం గుర్తించి తన సోదరికి ఫోన్ చేసి చెప్పిందని.. అయితే ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు పంక్చర్ వేయిస్తామంటున్న విషయాన్ని కూడా సోదరికి చెప్పింది. అయితే ఈ ఇద్దరు వ్యక్తులే ప్రియాంకపై దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వస్తున్నాయి.
కాగా మరోవైపు పోలీసులు ఘటన స్థలానికి సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు. కాగా సీసీ పుటేజీని పరిశీలిస్తే మరింత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని డీసీపీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. ప్రియాంక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఉరితీయాలని కుటుంబ సభ్యులు.. పోలీసులను కోరుతున్నారు. కాగా ఈ మధ్య ఇలాంటి సజీవ దహనాలు ఎక్కువవుతున్నాయి. ఇదే జిల్లాలో ఇప్పటికే ఓ ఘటన చోటుచేసుకుంది కూడా.
అసలేం జరిగింది..!?
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలిని డాక్టర్ ప్రియాంకారెడ్డిగా గుర్తించారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం. అయితే శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తున్నట్టు సమాచారం. రోజూ స్కూటీ మీద ప్రియాంకారెడ్డి విధులకు వెళ్లేది. అయితే రోజు మాదిరిగానే బుధవారం స్కూటిపై వెళ్లిన ప్రియాంక తెల్లారే సరికి సజీవ దహనమైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments