Bigg Boss Telugu 7 : హగ్గులు, ముద్దులతో ప్రియాంకను ముంచెత్తిన ప్రియుడు.. కిచెన్‌కే అంకితమవుతావా హిత బోధ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు, వాగ్వాదాలకు బదులుగా ఈ వారం ఎమోషనల్ టచ్ ఇస్తున్నారు నిర్వాహకులు. కుటుంబ సభ్యులను, మిత్రులను హౌస్‌లోకి పంపుతూ కంటెస్టెంట్స్‌ను ఖుషీ చేస్తున్నారు . నిన్న శివాజీ కుమారుడు శ్రీ, అర్జున్ అంబటి సతీమణి సురేఖ, అశ్విని శ్రీ అమ్మగారు లోపలికి వచ్చారు. ఎవ్వరిని నమ్మొద్దని, నిజాయితీగా జాగ్రత్తగా ఆడాలని వీరు తమ వారికి సలహాలిచ్చారు. అలాగే గర్భవతి అయిన సురేఖకు ఇంటి సభ్యులు శ్రీమంతం చేశారు. ఇది నిన్నటి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇవాళ గౌతమ్ అమ్మగారు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకుముందు ఓ పంచెని ఆమె కొడుకుకి పంపింది. అది తన కోసమేనని గౌతమ్ గుర్తు పట్టలేకపోయాడు. కాసేపటికి కన్నయ్య.. కన్నయ్య అని పిలుపు వినిపించడంతో అమ్మ వచ్చిందని గౌతమ్ అర్ధం చేసుకున్నాడు. తన తల్లి ఎక్కడుందా అని హౌస్ మొత్తం వెతికాడు.. ఎట్టకేలకు ఆమె ఇంట్లోకి ప్రవేశించడంతో తల్లిని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. తర్వాత ఇంటి సభ్యులందరినీ పలకరించిన ఆమె .. మా అబ్బాయికి అమ్మాయిల్లో చాలా ఫాలోయింగ్ వుందంటూ మురిసిపోయింది. అనంతరం తల్లీకొడుకులిద్దరూ పక్కకు వెళ్లి మాట్లాడుకున్నారు.
బాగానే ఆడుతున్నావ్, కానీ మాటలు కొంచెం రాకుండా చూడు. ఏదైనా పాయింట్ అనుకుంటే దాని మీద స్ట్రాంగ్‌గా నిలబడాలని.. వివరణ ఇవ్వొద్దని, ఏమవుతుందోనన్న భయం వద్దని , నీకు ఎప్పుడూ అమ్మ అండగా వుంటుందని ఆమె గౌతమ్‌కు ధైర్యం నూరిపోశారు. తర్వాత హౌస్‌లో మీరంతా అమ్మని మిస్ అవుతున్నారంటూ.. అందరినీ ఓ చోట కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఆమె గురుముద్దలు తినిపించారు. అనంతరం గౌతమ్, వాళ్ల మదర్ డ్యాన్స్ చేశారు.. ఇది చూసి శోభాశెట్టి, ప్రిన్స్ యావర్లకు తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. దీనిని గమనించిన ఆమె యావర్‌ను పిలిచి నువ్వు కూడా నా బిడ్డలాంటి వాడివే. బయటికొచ్చాక మా ఇంటికి రా అంటూ సర్దిచెప్పి అందరి దగ్గరా వీడ్కోలు చెప్పి ఆమె వెళ్లిపోయారు.
అనంతరం ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివకుమార్ వచ్చాడు. గులాబీ పువ్వు తీసుకొచ్చి.. మోకాళ్లపై వంగి ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. ఆపై హగ్గులు, ముద్దులతో ఆమెను ముంచేశాడు. ఎవరూ చూడకుండా ఏమైనా అడ్డుపెట్టనా అంటూ అర్జున్ సెటైర్ వేస్తాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా వీరిద్దరూ అతుక్కునే వున్నారు. వాళ్ల విరహం ఏమో కానీ ఇది చూసేవాళ్లకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. దేన్నీ తెగే దాకా లాగొద్దని ప్రియాంకకు శివకుమార్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ వంటి వారు నీకు అవసరమే లేదని .. ఎప్పుడూ వంటగదికే పరిమితమవుతున్నావని, బయటకు రావాలని సూచించాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అడగ్గా.. బయటికొచ్చాక చేసుకుందామన్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి శివకుమార్ వెళ్లిపోయాడు.
అతను వెళ్లిన కాసేపటికీ భోలే షావళి వైఫ్ వచ్చింది. ఆమెను చూడగానే ఖుషీ అయిన అతను రెండు మూడు పాటలు పాడి అలరించారు. కప్ గెలవడమే కాదు.. అందరి మనసులను కూడా గెలుచుకుని వస్తానని భోలే హామీ ఇచ్చాడు. మొత్తానికి ఇవాళ్టీ ఎపిసోడ్లో ప్రియాంక, శివకుమార్ జోడీ హైలైట్ అయ్యింది. ఇన్నాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో లేని రోమాంటిక్ టచ్‌ని వాళ్లిద్దరూ ఇచ్చి కలర్ఫుల్గా మార్చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments