వివాద‌స్ప‌ద‌మైన పాత్ర‌లో ప్రియమణి

  • IndiaGlitz, [Tuesday,December 03 2019]

ప‌రుత్తి వీర‌న్‌తోనే జాతీయ అవార్డుని ద‌క్కించుకున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి ఆ గుర్తింపుతో తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ఈమె క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈమె ఓ వివాద‌స్ప‌ద‌మైన పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. వివ‌రాల‌మేర‌కు త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం 'త‌లైవి'.

బాలీవుడ్ స్టార్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తుంది. రీసెంట్‌గా జ‌య‌ల‌లిత‌లా కంగ‌నా లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాగా.. జ‌య‌లలిత అంటే ఎవ‌రైనా గుర్తుకొచ్చే మ‌రో పేరు ఆమె స్నేహితురాలు శ‌శిక‌ళ‌. జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం ఆమె త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని చాలా ప్ర‌య‌త్నాలే చేసింది. ప్ర‌స్తుతం ఆమె అవినీతి కేసులో జైలు జీవితాన్ని అనుభ‌విస్తున్నారు. ఇలాంటి ఓ వివాద‌స్ప‌ద‌మైన పాత్రను త‌లైవి చిత్రంలో కూడా చూపించాల్సి ఉంది. కాబ‌ట్టి ఆ పాత్ర‌కు ప్రియ‌మ‌ణి అయితే న్యాయం చేస్తుంద‌ని భావించిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను సంప్ర‌దించార‌ట‌. ఆమె అందుకు ఓకే చెప్పార‌న‌టి టాక్‌. అలాగే మ‌రో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎం.జి.రామచంద్ర‌న్ పాత్ర‌లో అర‌వింద స్వామి న‌టిస్తున్నారు.

ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు ఇందూరి తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూన్ 26 న సినిమా విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ చెన్నైలో జ‌ర‌గుతుంది.