'నారప్ప' లో సుందరమ్మ గా ప్రియమణి
Send us your feedback to audioarticles@vaarta.com
సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం నారప్ప. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి మొదటిసారి విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్నారు.
నారప్ప చిత్రం లో ప్రియమణి సుందరమ్మ గా చాలా రోజులు మన తెలుగు వారికి గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ రోజు సుందరమ్మ ప్రియమణి పుట్టినరోజు సందర్భంగా ఇలా మరెన్నో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నారప్ప టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ సుందరమ్మ పాత్ర లుక్ ని విడుదల చేశారు.
విక్టరీ వెంకటేష్, ప్రియమణి నటిస్తున్న ఈ చిత్రానికి, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజయ్, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కృష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఫైనాన్స్ కంట్రోలర్: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్ కంట్రోలర్: రామబాలాజి డి., ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఏపీ పాల్ పండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ దొంకాడ, కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments