గర్భవతిగా ప్రియమణి.. క్రేజీ డీటెయిల్స్ ఇవిగో..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియమణి వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. టివి షోలతో బిజీగా మారింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
ఇదీ చదవండి: వైరల్ పిక్స్: బ్లౌజ్ బటన్ ఓపెన్ చేసి సెక్సీ ఫోజులు!
ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా తన పాపులారిటీ పెంచుకుంది ప్రియమణి. అలాగే సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంటోంది. తాజాగా ప్రియమణిని మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది కన్నడలో 'యాక్ట్ 1978' అనే చిత్రం విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫీమేల్ సెంట్రిక్ కథాంశంతో తెరకెక్కింది. ఈ మూవీలో యజ్ఞ శెట్టి ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారు. తెలుగు రీమేక్ లో ప్రియమణి లీడ్ రోల్ లో నటించనుంది. కథానుగుణంగా ప్రియమణి గర్భవతిగా నటించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ఓ గర్భవతిగా ప్రియమణి కనిపించనుంది. చివరకు తన హక్కులు సాధించుకునేందుకు మానవ బాంబుగా మారి ప్రభుత్వ కార్యాలయంలోకి వెళుతుంది. ఎవ్వరిని బయటకు వెళ్లనివ్వకుండా తలుపులు మూసేస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి అనేదే ఈ చిత్ర కథ.
త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా ప్రియమణి ప్రస్తుతం నారప్ప, విరాటపర్వం చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com