అలా చెప్పడం కూడా తప్పేనా - ప్రియమణి
- IndiaGlitz, [Friday,May 06 2016]
కేరళ లోని లా స్టూడెంట్ జిషాను అత్యాచారం చేసి...ఆతర్వాత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై కథానాయిక ప్రియమణి ట్విట్టర్ లో...ఆడవాళ్లను వేధించే వాళ్లను వదలకూడదు. అరబ్ దేశాల్లో అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. మన దేశంలో కూడా కఠిన శిక్షలు విధించాలి. కఠిన శిక్షలు విధిస్తేనే నేరాలు తగ్గుతాయి. మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు. అందుచేత ఏ దేశంలో మనకు రక్షణ ఉంటుందో అక్కడికి వెళ్లిపోవడం మంచిది అంటూ ప్రియమణి స్పందించారు. అయితే..ప్రియమణి ఇలా దేశాన్ని విడిచి వెళ్లిపోవడం మంచిది అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి.
కఠిన శిక్షలు విధించాలి అనడం కరెక్టే. కానీ...దేశాన్ని విడిచి వెళ్లిపోదాం అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రియమణిని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రియమణి స్పందిస్తూ...దేశంలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పాను. నిర్భయంగా నా అభిప్రాయం చెప్పడం కూడా తప్పేనా..? నిర్భయంగా మాట్లాడితే నేనేదో దేశానికి వ్యతిరేకం అన్నట్టు నా పై ముద్ర వేస్తారా..అంటూ ప్రియమణి ఆవేదన వ్యక్త చేస్తుంది. దయచేసి నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దు అంటుంది. అందుకనే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆలోచించకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. పెదవి దాటని మాటకు ప్రభువు నీవు...పెదవి దాటిన మాటకు బానిసవు నీవు...ఎవరైనా సరే...ఇది తెలుసుకుని మాట్లాడితే...ఏ సమస్య రాదు.