రవితేజ విషయంలో ప్రియదర్శి కల నెలవేరిందట
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు ప్రారంభమైంది. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 'నేల టికెట్' అనే పేరు ప్రచారంలో ఉంది. ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రవితేజ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు.
ఇదిలా ఉంటే...ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న యువ నటుడు ప్రియదర్శి (పెళ్లి చూపులు ఫేం).. రవితేజతో కలిసి దిగిన సెల్ఫీని 'మాస్ మహారాజా'తో అని తన ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఎప్పటినుంచో రవితేజతో కలిసి పని చేయాలనే కోరిక ఉండేదని అది ఈ రోజు తీరిందనట్టుగా "డ్రీమ్స్ డు కం ట్రూ" అని ట్యాగ్ పెట్టారు ప్రియదర్శి.
పలు చిత్రాల్లో బిజీగా ఉన్న ప్రియదర్శి.. ప్రస్తుతం అ! చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫేక్ చెఫ్‌గా ఓ డిఫరెంట్ రోల్లో ఈ చిత్రం కోసం కనిపించనున్నాడు ప్రియదర్శి. ఇక రవితేజ నటించిన తాజా చిత్రం 'టచ్ చేసి చూడు' ఫిబ్రవరి 2న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments