ప్రియదర్శి ‘కంబాలపల్లి కథలు’.. షూటింగ్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజానీకం ఆన్‌లైన్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్‌కు కూడా ఆదరణ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే నటీనటులంతా వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. తాజాగా కమెడియన్ ప్రియదర్శి కూడా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘కంబాలపల్లి కథలు’ పేరుతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
‘కంబాలపల్లి’ వరంగల్ జిల్లాలో ఉంది. ఈ అందమైన గ్రామానికి కథకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ... ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొత్తం గ్రామీణ నేపథ్యంలోనే సాగనున్నట్టు తెలుస్తోంది. హైబాత్ అనే పాత్రలో ప్రియదర్శి మెప్పించనున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు మహానటి నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ విషయాన్ని ‘కంబాలపల్లి కథలు’ నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com