ప్రియదర్శి డెడికేషన్ కి క్లాప్స్ కొట్టాల్సిందే.. ఆ బాధ భరిస్తూ..

  • IndiaGlitz, [Tuesday,June 08 2021]

కొత్త తరం కమెడియన్స్ లో ప్రియదర్శి ప్రత్యేకమైన నటుడు. ప్రతి చిత్రంలోనూ ప్రియదర్శి తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. తన కామెడీకి మంచి స్పందన వస్తోంది కాబట్టి కమెడియన్ గానే చేస్తాను.. ఇతర రోల్స్ చేయను అనే కండిషన్స్ ప్రియదర్శి దగ్గర ఉండవు.

ఇదీ చదవండి: ఇలియానాపై బ్యాన్.. విక్రమ్ సినిమాతో గొడవ, నిర్మాత షాకింగ్ కామెంట్స్!

మల్లేశం లాంటి ఎమోషనల్ చిత్రంలో లీడ్ రోల్ లో ప్రియదర్శి మెప్పించాడు. ఈ సారి ప్రియదర్శి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' అనే వెబ్ సిరీస్ లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల టీజర్ లో ప్రియదర్శి పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. బోల్డ్ రోల్ యాక్షన్, ఎమోషన్ కలగలిపిన పాత్రలో ప్రియదర్శి రెచ్చిపోతున్నాడు.

ఆహాలో ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియదర్శి చూపిన డెడికేషన్ గురించి తెలిస్తే క్లాప్స్ కొట్టాల్సిందే. షూటింగ్ సమయంలో ప్రియదర్శి కాలికి గాయం అయ్యిందట. ఆ బాధని భరిస్తూనే ప్రియదర్శి షూటింగ్ పూర్తి చేశాడట. ఆ గాయం నుంచి కోలుకోవడానికి ప్రియదర్శికి మూడు నెలల టైం పట్టిందంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

పాత్ర కోసం తాను కమిటైతే ప్రాణం పెట్టి చేస్తానని ప్రియదర్శి మరోసారి నిరూపించుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.