ప్రియా వారియర్‌కు సుప్రీమ్‌లో ఊరట...
Send us your feedback to audioarticles@vaarta.com
'ఒరు అదార్ లవ్' అనే మలయాళ సినిమాలో నటించిన హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వచ్చిందో... అదెలా చిక్కులు కూడా వచ్చి పడ్డాయి. ఈ సినిమాలో విడుదలైన పాట వివాదానికి తావిచ్చింది. పాట ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని తెలంగాణ, మహారాష్ట్ర పోలీస్ స్టేషన్స్‌లో పలువురు ప్రియా ప్రకాశ్ వారియర్ సహా సినిమా దర్శక నిర్మాతలపై కేసులు పెట్టారు.
ఈ కేసుల విషయంలో క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ఇటీవల ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ స్టే విధించింది. ప్రియాకు వ్యతిరేకంగా తెలంగాణ, మహారాష్ట్రల్లో నమోదైన కేసులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం దేశంలో ఎక్కడా కూడా నటి ప్రియపై, సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com