రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను - ప్రియా వ‌డ్ల‌మాని

  • IndiaGlitz, [Monday,August 27 2018]

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ప్రేమ రెయిన్ చెక్'. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిన్నారు. అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7 న విడుద‌ల అవుతుంది.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ప్రియా వ‌డ్ల‌మాని పాత్రికేయుల‌తో మాట్లాడుతూ ....
''నాది హైద‌రాబాద్‌. మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా ఓ సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా ఆగిపోయింది. త‌ర్వాతే ప్రేమ‌కు రెయిన్ చెక్ సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇందులో నేను చాలా సైలెంట్‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను. త‌న ప్ర‌పంచంలో తాను ఉండే హీరోయిన్‌. ఇప్ప‌టి అమ్మాయి అంటే ప‌బ్‌ల‌కు, పార్టీల‌కు వెళ్ల‌డ‌మే కాదు.. మంచి సహృద‌యురాలై ఉంటుంది. జీవితంలో కొన్ని విలువ‌లుంటాయి. విదేశాల్లో చదువుకోవాల‌ని ఉన్నా.. త‌ల్లిదండ్రుల‌పై ఆధార‌ప‌డ‌కుండా చ‌దువుకోవాల‌ని అనుకుంటుంది. నిజ జీవితంలో నేను కూడా కామ్‌గానే ఉంటాను.

నా రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌. నాకు అడ్వేంచ‌ర్స్ అంటే ఇష్టం. అందుకే ఎటువంటి డూప్ లేకుండా నేనే న‌టించాను. అందుకు కారణం ఈ సినిమాలో నేను అడ్వెంచ‌రెస్ విష‌యాల‌ను హ్యాండిల్ చేసే కంపెనీలో ప‌నిచేస్తుంటాను. కాబ‌ట్టి క్యారెక్ట‌ర్ ప‌రంగా అడ్వెంచ‌ర‌స్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది. కాబ‌ట్టి అడ్వెంచ‌ర‌స్ విష‌యాల‌ను డూప్ లేకుండా చేశాను. ఇది ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీలా ఉంటుంది కానీ.. ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ కాదు. సాధార‌ణంగా మ‌నం ఎవ‌రికైనా స‌హాయం చేసిన‌ప్పుడు..వారు మ‌న‌కు వెంట‌నే స‌హాయం చేయాలంటే..వెంట‌నే స‌హాయం తీసుకోకుండా.. ఇప్పుడు కాదు.. నేను అడిగిన‌ప్పుడు స‌హాయం చెయ్ అనడాన్ని రెయిన్ చెక్ అంటారు.

ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే.. ఇందులో హీరో ఆఫీస్ వ్య‌వ‌హారాల‌కు, ప్రేమికురాలికి లింక్ ఉండ‌కూడ‌ద‌నుకునే వ్య‌క్తి. అందుక‌నే.. ఈ సినిమాకు ప్రేమ‌కు రెయిన్ చెక్ అనే టైటిల్‌ను పెట్టాం. డైరెక్ట‌ర్ ఆకెళ్ళ పేరి శ్రీనివాస్‌గారు చ‌క్క‌గా అంద‌రి నుండి త‌న‌కు కావాల్సిన న‌ట‌న రాబ‌ట్టుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఒక‌టిన్న‌ర నెల ముందు నుండి వ‌ర్క్‌షాప్స్ చేయ‌డం వ‌ల్ల సుల‌భంగా న‌టించ‌గలిగాను'' అన్నారు.

More News

ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయిన 'దిక్సూచి' హిందీ రైట్స్

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం,

కొత్త జోన‌ర్ సినిమాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నాన్ని 'నీవెవ‌రో' తో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో

సొంతంగా డ‌బ్బింగ్‌...

'ఛ‌లో'తో హిట్ అందుకున్న ర‌ష్మిక తాజాగా విడుద‌లైన 'గీత గోవిందం'తో మరో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే 'డియ‌ర్ కామ్రేడ్‌' లో న‌టిస్తుంది.

సైరాలో ట‌బు

మెగాస్టార్ 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి' ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. పాలెగాడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి బ‌యోపిక్ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

కృష్ణ బ‌యోపిక్‌...

సూప‌ర్‌స్టార్ కృష్ణ జీవిత చరిత్ర కూడా సినిమా రూపంలో తెర‌కెక్క‌నుంది. తెలుగు సినిమాను టెక్నిక‌ల్‌గా, జోన‌ర్స్ ప‌రంగా కొత్త పుంత‌లు తొక్కించిన హీరోల్లో కృష్ణ ముందు వ‌రుస‌లో ఉంటారు.