బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ సినీ నటి ప్రియా
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీనటి ప్రియా రామన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. ప్రజాసేవ కోసమే బీజేపీలో చేరానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నానని.. అందుకే తాను కాషాయ కండువా కప్పుకున్నానన్నారు. మోదీ అంటే తనకెంతో అభిమానమని.. సత్యమూర్తిని కూడా తానెంతో గౌరవిస్తానన్నారు.
రోజా గురించి...!
వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి మాట్లాడమని అడగ్గా.. రోజా.. నేను మంచి స్నేహితులం అంతే పోటీదారులం మాత్రం కాదన్నారు. ఏపీ రాజకీయాల గురించి ఇప్పుడేం మాట్లాడలేమని ప్రియా చెకప్పుకొచ్చారు. బీజేపీ గురించి మాట్లాడిన ఆమె.. పార్టీ పటిష్టతకు తన వంతు కృషి చేస్తానన్నారు. పార్టీ ఏమీ చెప్పలేనని.. బీజేపీ అధిష్టానం ఏం ఆదేశిస్తే.. అది చేస్తానని చెప్పారు.
ఇంతకీ ఎవరీ ప్రియా రామన్!!
44 సంవత్సరాల ప్రియా రామన్ 1993లో వచ్చిన ‘వల్లి’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రియా రామన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా తెలుగులో ‘శుభసంకల్పం’, ‘మావూరి మారాజు’తో పాటూ పలు సినిమాల్లో నటించి ఎందరో ఆదరాభిమానులు పొందారు. గత ఏడాది ‘పడి.. పడి లేచే మనసు’ సినిమాలో చివరిసారిగా నటించారు. ప్రియారామన్ పాల్ఘాట్ నాయర్ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించడంతో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆమెను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావించిందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout