బిగ్‌బాస్ 5 తెలుగు: టెన్షన్ పెట్టిన నాగ్...  చివరికి ప్రియా ఎలిమినేట్, షాక్‌లో హౌస్‌మేట్స్

  • IndiaGlitz, [Monday,October 25 2021]

బిగ్‌బాస్ 5 తెలుగులో ఆదివారం ఎపిసోడ్ ఊహించని ట్విస్ట్‌లతో సాగింది. సరదాగా సాగుతూనే హౌస్ మెంబర్స్‌కి షాకిచ్చేలా షోను నడిపించారు నాగ్. చిన్నచిన్న పొరపాట్లు కూడా భారీ మూల్యం చెల్లించేలా దారితీస్తాయి. ఓటింగ్‌లో టాప్‌లో వుండే ప్రియ ఎలిమినేట్ అవ్వడం కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురిచేశాయి. మరి దీనికి దారి తీసిన కారణాలేంటీ..? వెళుతూ వెళుతూ ఇంటి సభ్యుల గురించి ప్రియ ఏం చెప్పిందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

సన్‌డే స్టేజ్ పైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు కింగ్ నాగార్జున. అనంతరం హౌస్ మేట్స్ తో నాకౌట్ రౌండ్స్ అంటూ కొన్ని టాస్క్ లు చేయించారు. పిల్లోస్ తో మొదలు పెట్టిన గేమ్.. మ్యూజికల్ చైర్స్, టోపీ గేమ్ వరకు సాగింది. ఒక్కో గేమ్‌లో కొంతమంది నాకౌట్ అవుతూ ఉంటారు. ఒక రౌండ్ పూర్తిగా సినిమాలకు రిలేటెడ్‌గా సాగింది. ఇంద్ర చిత్రంలో చిరంజీవి రెండు పేర్లు ఏంటి అని నాగార్జున గేమ్‌లో ఆడుతున్న వారిని అడిగారు. తప్పు ఆన్సర్ ఇచ్చిన వారు నాకౌట్ అవుతారు. చాలా మంది ఫ్లాష్ బ్యాక్‌లోని ఇంద్రసేనారెడ్డి చెప్పారు కానీ.. కాశీ బ్యాక్ డ్రాప్‌లో నడిచే రెండవ పేరు శంకర్ నారాయణ చెప్పలేకపోయారు. అలా చివరకు విశ్వ, యానీ మాస్టర్ ఫైనల్స్‌కి చేరుతారు.

వీరిద్దరికి నాగ్ టోపీలతో ఫైనల్ గేమ్ పెడతారు. ఇద్దరూ టోపీ ధరించాలి. నాకౌట్ అయిన మిగిలిన సభ్యులు తమకు ఇష్టమైన వారిని ఎంచుకోవచ్చు. అలా కొంతమంది యానీ వైపు, కొందరు విశ్వ వైపు వుంటారు... యానీ మాస్టర్‌ వైపు ఉన్నవారు విశ్వ టోపీ కింద పడేయడానికి.. విశ్వ వైపు ఉన్నవారు యానీ టోపీ పడేయడానికి ప్రయత్నించాలి. చివరికి ఈ గేమ్‌లో యానీ మాస్టర్ విన్నర్‌గా నిలుస్తుంది. దీంతో ఆమెకు బిగ్ బాస్ నుంచి ఓ పవర్ లభిస్తుంది.

ఇక నామినేషన్‌లో ఉన్న ఆరుగురిని మిసెస్ ప్రభావతి ముందు నుంచోమని చెప్పారు. ఎవరైతే ప్రభావతి ముందు నుంచున్నప్పుడు కోడి సౌండ్ వస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు చెప్పారు నాగార్జున. ఈ టాస్క్‌లో జెస్సీ వెళ్లి ప్రభావతి‌ని 'ప్లీజ్ బేబీ' అంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ అతడు సేవ్ అవ్వలేదు. ఆ తరువాత రవి వెళ్లగా.. అతడిని ఉద్దేశించి మిసెస్ ప్రభావతిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయి అంటూ సెటైర్ వేశారు నాగ్. దానికి రవి 'అది ఇన్‌ఫ్లూయెన్స్ కాదు సర్' అని బదులిచ్చాడు. అయితే చివరికి రవి కూడా ఈ టాస్క్ లో సేవ్ అవ్వలేదు. లోబో వెళ్లినప్పుడు మాత్రం కోడి సౌండ్ వినిపించడంతో అతడు సేఫ్ అయినట్లు ప్రకటించారు నాగార్జున. నామినేషన్ లో ఉన్న ఐదుగురిని మరోసారి నుంచోమని చెప్పిన నాగార్జున.. తన చేతిలో ఉన్న డాల్ ఎవరు సేఫ్ అవుతుందో చెప్తుందని అన్నారు. చాలా సేపు టెన్షన్ పెట్టిన నాగార్జున.. ఆ డాల్ లో రవి పేరు ఉన్నట్లు ప్రకటించారు.

నామినేషన్‌లో మిగిలిన నలుగురిని లైన్లోకి రమ్మని చెప్పిన నాగార్జున వారికి ఫ్రూట్ జాక్ పాట్ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో సిరి సేఫ్ అయినట్లు చెప్పారు నాగార్జున. చివరగా నామినేషన్స్ లో యానీ మాస్టర్, ప్రియా, జెస్సి ఉంటారు. వీరు ముగ్గురుకి మూడు బెలూన్స్ ఇస్తారు. కెప్టెన్ సన్నీ ఆ బెలూన్స్‌ని పగలగొడతారు. బెలూన్స్ లోపల సేఫ్ అనే చీటీ వచ్చిన వారు సేఫ్. అలా జెస్సి సేఫ్ అవుతారు. ఫైనల్‌గా యానీ, ప్రియా నామినేషన్స్‌లో మిగులుతారు. ఇక్కడే నాగ్ ఊహించని ట్విస్ట్ ఇస్తారు. మీ ఇద్దరూ వెళ్లి ఇంటి సభ్యులకు వీడ్కోలు చెప్పేసి బయటకు వచ్చేయండి.. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిశాక బై చెప్పే అవకాశం కూడా వుండదు అని నాగ్ హౌస్‌మేట్స్‌ని టెన్షన్ పెడతారు. దీంతో యానీ, ప్రియా ఇద్దరూ ఇంటి సభ్యులు బై చెప్పి బయటకు వస్తారు.

అక్కడ చిన్న గదుల్లోకి ప్రవేశిస్తారు. మిగిలిన హౌస్ మేట్స్ మొత్తం లివింగ్ రూమ్‌లోనే ఉంటారు. ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూడమని నాగార్జున ఇంటి సభ్యులను ఆదేశిస్తారు. దీంతో హౌస్ మేట్స్ అంతా ఆ చిన్న రూమ్స్ వైపు పరుగులు తీస్తారు. గదులన్నీ ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ కనిపించరు. దీంతో ఇంటి సభ్యులు కంగారు పడతారు. వెయిట్ చేయండి బహుశా ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారేమో అని నాగ్ ఇంకా టెన్షన్ పెంచుతారు. కాసేపటి తరువాత యానీ మాస్టర్ ఒక్కటే లివింగ్ రూమ్‌లోకి రావడంతో.. ప్రియా ఎలిమినేట్ అయిందని హౌస్ మేట్స్ అర్ధం చేసుకుంటారు. దీంతో ప్రియాంక వెక్కి వెక్కి ఏడ్చేసింది. యానీ మాస్టర్‌ని చూసి సన్నీ కూడా యానీని పట్టుకొని ఏడ్చేశాడు.

ఎలిమినేషన్‌ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్‌ ఆడించాడు నాగ్‌. హౌస్‌మేట్స్‌కు ప్రోగ్రెస్ కార్డ్‌ ఇవ్వమని ఆదేశించాడు. లోబోకి 5 మార్కులు ఇస్తూ.. ఒక సైడ్ ఉండడని రీజన్ చెప్పింది. ఆ తరువాత విశ్వకి 5 మార్కులు ఇస్తూ.. వేరే వాళ్లకి గేమ్ ఆడడానికి ఛాన్స్ ఇవ్వమని సలహా ఇచ్చింది. అలాగే టాస్క్‌లు ఆడేటప్పుడు ఎవరినీ బాధపెట్టొద్దని చెప్పింది. రవికి 5 మార్కులు ఇస్తూ.. సిల్లీ రీజన్స్ తో నిన్ను నామినేట్ చేసేవాళ్లు ఉండరని చెప్పింది. షణ్ముఖ్ కి ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చి.. చాలా మంచి అబ్బాయి అని, ఇలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలని కాంప్లిమెంట్ ఇచ్చింది. సిరికి కూడా ఎనిమిదిన్నర మార్కులు ఇచ్చి.. ఈ అమ్మాయి చిచ్చరపిడుగు అని , చాలా బాగా ఆడుతుందని ప్రశంసించింది. శ్రీరామచంద్రకి 8 మార్కులు ఇస్తూ.. తన పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుందని చెప్పింది. ప్రియాంకకి 10కి వంద మార్కులు ఇచ్చింది ప్రియా.

యానీ మాస్టర్‌కి 10 మార్కులు ఇచ్చి.. చాలా బ్యూటిఫుల్ సోల్ అని, కానీ అందరినీ నమ్మేస్తారంటూ చెప్పింది. జెస్సీకి 8 మార్కులు ఇస్తూ.. చాలా బాగా ఆడుతున్నాడని చెప్పింది. కాజల్‌కి 7 మార్కులు ఇచ్చి.. స్టార్టింగ్‌లో బాగా ఆడావ్.. ఇప్పుడు నీ గేమ్ అందరికీ అర్ధమైపోతుందని చెప్పింది. మానస్‌కి 10 కి పది మార్కులు ఇచ్చి.. షో స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాడో ఈ రోజుకీ కూడా అలానే ఉన్నాడని చెప్పింది. సన్నీకి 9 మార్కులు ఇస్తూ.. 'నా ప్లేట్ లో తినే రైట్.. నా కప్పులో తాగే రైట్ నీకు మాత్రమే ఉంది' అంటూ ఫన్ చేసి అందరి దగ్గర వీడ్కోలు తీసుకుంది. ఆ తర్వాత ప్రియా వెళ్లిపోయిందని గార్డెన్ ఏరియాలో కూర్చొని ఏడుస్తున్న ప్రియాంకను మానస్ ఓదార్చే ప్రయత్నం చేశాడు.