Prithviraj:ప్రభాస్ 'సలార్' మూవీ నుంచి పృథ్వీరాజ్ కొత్త పోస్టర్ విడుదల..

  • IndiaGlitz, [Monday,October 16 2023]

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న మూవీల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు భారతీయ సినీ ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.

మలయాళంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్..

రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ పార్ట్ 1లో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండగా.. పార్ట్ 2లో మాత్రం పృథ్వీరాజ్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మలయాళంలో పృథ్వీరాజ్‌ స్టార్ హీరోగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఆయనకు అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు.

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల..

ఇక 'సలార్' చిత్రాన్ని మొదటగా సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది మూవీ టీమ్. అయితే కొంత వర్క్ మిగిలిపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేసింది. ఇటీవల క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఈ సినిమాలో శృతిహాసన్, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. కేజీఎఫ్, కాంతార వంటి బ్లాక్‌బాస్టర్ సినిమాలు నిర్మించన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.

వరుస సినిమాలతో బిజీగా ప్రభాస్..

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే 'బాహుబలి' సిరీస్ తర్వాత ఆయనకు ఆ స్థాయి హిట్ పడలేదు. ఆ తర్వాత వచ్చిన సాహో, రాథేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు మంచి కలెక్షన్లు తెచ్చిపెట్టినా అభిమానులను మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో డార్లింగ్ అభిమానులంతా సలార్‌ మూవీపైనా హోప్స్ పెట్టుకున్నారు. ఇక సలార్‌తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె, మారుతి డైరెక్షన్‌లో రాజా డీలక్స్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తూ బిజీగా ఉన్నారు.

More News

CM Jagan:డిసెంబర్‌లోపు విశాఖ నుంచే పరిపాలన.. సీఎం జగన్ క్లారిటీ..

విశాఖపట్టణం నుంచి పరిపాలనపై సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లోపు తాను వైజాగ్ నుంచే పాలన చేయనున్నట్లు తెలిపారు.

Former Bhadrachalam MLA:తెలంగాణ బీజేపీలో విషాదం.. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.

Bigg Boss 7 Telugu : మళ్లీ అమ్మాయే.. నయని పావని ఎలిమినేషన్, ఇంటి సభ్యులంతా కంటతడి .. ఎమోషనలైన నాగ్

బిగ్‌బాస్ సీజన్ 7లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఐదుగురిని ఇంటిలోకి పంపించిని బిగ్‌బాస్..

YSRCP Social Media: లండన్‌లో ఘనంగా వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం..భారీగా హాజరైన కార్యకర్తలు

రాష్ట్రం సంక్షేమం కోసం సీఎం జగన్ అనుక్షణం ఎంతో కష్టపడుతున్నారని సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు.

KCR:తెలంగాణ ప్రజలపై కేసీఆర్ వరాలు జల్లు.. రూ.400కే గ్యాస్ సిలిండర్.. పింఛన్ రూ.5వేలకు పెంపు

ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సబ్బండ వర్గాలే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించారు.