రథం నిర్మాణంలో అగ్నికుల క్షత్రియులకు ప్రాధాన్యమివ్వండి: పవన్

  • IndiaGlitz, [Thursday,September 24 2020]

అంతర్వేది లక్ష్మీనారసింహుని రథం దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే రథ నిర్మాణ బాధ్యతలు అగ్నికుల క్షత్రియులకు అప్పగించాలని.. లేదంటే నిర్మాణంలో వారికి ప్రాధాన్యమివ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆలయానికి నూతన రథం నిర్మాణంలో ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని పవన్ కోరారు.

అంతర్వేదిలో లక్ష్మీ నారసింహుడిని అగ్ని కులక్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారని పవన్ పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి యావన్మందికి విదితమేనన్నారు. స్వామివారి తొలి రథాన్ని కూడా కృష్ణమ్మ రూపొందించారని ఈ సందర్భంగా పవన్ గుర్తు చేశారు. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదేనని వెల్లడించారు.

ఇప్పుడు నూతన రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం వారు ఆవేదన చెందుతున్నారని పవన్ పేర్కొన్నారు. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయలకు ప్రాతినిథ్యం లేకపోవడం శోచనీయమన్నారు. రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులేనని వెల్లడించారు. కాబట్టి వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అగ్నికుల క్షత్రియులను గౌరవిస్తూ రథం తయారీలో వారిని భాగస్వామ్యులను చెయ్యాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.

More News

ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన యాపిల్ సంస్థ

ఇండియన్స్‌కి యాపిల్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాలో 'యాపిల్' సంస్థ ఆపరేషన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే ఈ సంస్థ ఆపరేషన్స్ ఇప్పటి వరకూ

'మేజ‌ర్‌'లో స‌ల్మాన్ హీరోయిన్‌

26/11..పాకిస్థాన్ ముష్క‌రులు ముంబైలోని తాజ్ హోట్‌లోపై దాడి జ‌రిపిన రోజుది. చాలా మంది ప్రాణాల‌ను కోల్పోయారు. భారత సైన్యం ప్రాణాలకు తెగించి ముష్కరులను మట్టుబెట్టింది.

ఉర్వశి రౌటేలా 'బ్లాక్ రోజ్' ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను

వేస‌వి బ‌రిలో చిరు, బాల‌య్య‌..!

మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డబోతున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ఈ అగ్ర క‌థానాయ‌కులు పోటీ ప‌డితే ఒక సంద‌ర్భంలో ఒక‌రిది పైచేయి

ర‌కుల్ నోటీసుల విష‌యంలో హై డ్రామా..!

సినీ ప‌రిశ్ర‌మ‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్నట్లు నార్కోటిక్ విచార‌ణ‌లో వెల్ల‌డి కావ‌డంతో అధికారులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. అందులో భాగంగా డ్ర‌గ్ మాఫియాతో డీలింగ్ ఉన్న‌ట్లు తెలిసిన