All India Service: ఆ అవార్డులు స్వీకరించొద్దు.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం హుకుం
- IndiaGlitz, [Saturday,June 24 2023]
అఖిల భారత స్థాయి అధికారులు (ఐఏఎస్, ఐపీఎస్ , ఐఎఫ్ఎస్)కు కేంద్రం షాకిచ్చింది. ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి పురస్కారాలు, అవార్డులు వంటి వాటని స్వీకరించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తే సంబంధిత శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఆ అవార్డుల్లో నగదు వుండరాదని తేల్చిచెప్పింది. పురస్కారం అందించే సంస్థకు క్లీన్‌చీట్ వుండాలని సూచిస్తూ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు అవార్డుల పేరుతో మచ్చిక చేసుకుంటున్నారనే వాదనలు వున్నాయి. అత్యున్నత స్థానాల్లో వున్న వీరిని అడ్డుపెట్టుకుని కొందరు లబ్ధిపొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం సివిల్ సర్వీస్ ఉద్యోగులు ప్రైవేట్ అవార్డులు అందుకునే విషయంలో ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేసింది.