Bigg Boss 7 Telugu : గౌతమ్‌కు అన్యాయం .. సందీప్‌పై గుస్సా, ప్రియాంకకున్న ధైర్యం అమర్‌కు లేకపోయే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో మూడో హౌస్మెట్ ఛాన్స్ కొట్టేసేందుకు కంటెస్టెంట్స్ కుస్తీ పడుతున్నారు. శోభాశెట్టి, అమర్దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్‌లను మూడో హౌస్‌మేట్ రేసు కోసం బిగ్‌బాస్ ఎంపిక చేశాడు. అయితే ఇది నచ్చని కొందరు కంటెస్టెంట్స్ కారాలు మిరియాలు నూరుతున్నారు. నిన్న శోభాశెట్టి, గౌతమ్ గొడవ తారా స్థాయికి చేరి సవాళ్లు విసురుకునే వరకు వచ్చింది. ఇప్పటికే బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో గెలిచి కంటెండర్‌గా పోటీ చేసేందుకు ప్రిన్స్ అర్హత సాధించాడు. ఇవాళ శోభాశెట్టిని పిలిచాడు. కారం తినడం అలవాటు లేని ఆమె ముందు స్పైసీ చికెన్ తినాల్సిందిగా టెస్ట్ పెట్టాడు. మీలో గెలవాలనే ఆకలిని నిరూపించుకునే సమయం వచ్చిందని చెప్పాడు. అయితే ఘాటుగా వున్న ఆ చికెన్ తినేందుకు శోభ తీవ్రంగా ప్రయత్నించింది. తన లైఫ్‌లో ఇంతకారం ఎప్పుడూ తినలేదని ఏడ్చింది. కానీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఏడవనని అమ్మకి మాట ఇచ్చానని.. కానీ కారం మంట నషాళానికి అంటి గుక్కపట్టి ఏడ్చేసింది.
ఇదే సమయంలో కంటెండర్‌గా శోభను వ్యతిరేకించిన శుభశ్రీ, దామిని, గౌతమ్‌ల ముందు కూడా కారంగా వున్న చికెన్ పెట్టారు. మీ ముగ్గురిలో ఎవరు త్వరగా చికెన్ తింటారో వాళ్లు శోభ స్థానంలో కంటెండర్‌గా వుంటారని బిగ్‌బాస్ చెప్పాడు. గౌతమ్ 28 చికెన్ ముక్కల్ని తినేసి బెల్ కొట్టాడు. ఈ పోటీకి సంచాలక్‌గా వున్న ఆట సందీప్ మాత్రం ఒక పీస్ కొంచెం మిగిల్చావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 ముక్కలే తిన్నట్లు ప్రకటించాడు. శోభాశెట్టి కంటే ఎక్కువ పీసులు తినలేకపోవడంతో ఆమెను కంటెండర్‌గా కంటిన్యూ చేశాడు బిగ్‌బాస్.
అనంతరం అమర్దీప్, ప్రియాంకలకు గట్టి పరీక్షే పెట్టాడు. పవర్ అస్త్రకు తాము అర్హులమని భావిస్తే.. జట్టు కట్ చేసుకోవాలని చెప్పాడు బిగ్‌బాస్. దీని ప్రకారం ప్రియాంక చెవుల వరకు, అమర్దీప్ గుండు చెయ్యించుకోవాలి. ట్రిమ్మర్‌తో 3 మిల్లిమీటర్ల వరకు మాత్రమే జుట్టు వుండేలా కట్ చేసుకోవాలని బిగ్‌బాస్ తేల్చిచెప్పాడు. దీనికి ప్రియాంక తాను సిద్ధమేనని చెప్పగా.. అమర్ మాత్రం భయపడ్డాడు. దీనికి గల కారణాలను కూడా చెప్పాడు. తాను రవితేజకి వీరాభిమానినని.. గతంలో ఆయన ఒకసారి తనను హగ్ చేసుకుని నా తల నిమురుతూ నీ హెయిర్ నాలాగే వుందన్నాడు. అమర్దీప్ భయపడుతూ వుండటంతో టేస్టీ తేజ పంచులేశాడు. జుట్టుదేముంది భయ్యా మళ్లీ వచ్చేస్తుంది.. కాకపోతే కొంచెం టైం పడుతుందన్నాడు.
అమర్దీప్ వెనకడుగు వేసినా ప్రియాంక మాత్రం తన షోల్డర్ వరకు హెయిర్ కట్ చేసుకుంది. దీంతో అమర్‌దీప్‌కు బదులుగా ప్రియాంక పవర్ అస్త్ర కంటెండర్‌గా నిలిచినట్లుగా బిగ్‌బాస్ ప్రకటించాడు. దీంతో ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, ప్రియాంకలు మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడనున్నారు. ఇకపోతే.. వారం నామినేషన్స్ లో అమర్ దీప్, దామిని, గౌతంకృష్ణ, ప్రియాంక, పిన్స్ యావర్, రతిక, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com