Bigg Boss Telugu 7 : ప్రిన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన శోభ తల్లి .. యావర్ బ్రదర్ రాకతో హౌస్‌లో అన్నదమ్ముల అనుబంధం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో ఎమోషన్ సీన్స్ పండుతున్నాయి. ఈ వారం మొత్తం ఎలాంటి గొడవలు, టాస్క్‌లు, ఛాలెంజ్‌లు లేకుండా ఫ్యామిలీ వీక్‌లా మారిపోయింది. శివాజీ కుమారుడు శ్రీ, అర్జున్ అంబటి సతీమణి సురేఖ, అశ్విని శ్రీ అమ్మగారు లోపలికి వచ్చారు. ఎవ్వరిని నమ్మొద్దని, నిజాయితీగా జాగ్రత్తగా ఆడాలని వీరు తమ వారికి సలహాలిచ్చారు. అలాగే గర్భవతి అయిన సురేఖకు ఇంటి సభ్యులు శ్రీమంతం చేశారు. ఇది ఆ రోజు ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. బుధవారం గౌతమ్ అమ్మగారు, ప్రియాంకా జైన్ బాయ్‌ఫ్రెండ్ శివకుమార్, భోలే షావళి వైఫ్ హౌస్‌లో అడుగుపెట్టారు. నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియాంక- శివకుమార్ జోడీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో మిస్సయిన రోమాంటిక్ టచ్‌ని వాళ్లిద్దరూ ఇచ్చారు.
ఇవాళ కూడా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోకి ప్రవేశించి తమ వారికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ అమర్ బర్త్ డే కావడంతో కేక్ పంపించి భర్తను ఆమె సర్‌ప్రైజ్ చేసింది. అమర్‌ను కింద కూర్చోబెట్టిన కంటెస్టెంట్స్ ఆమెతో రింగ్ తొడిగించారు. వాళ్లిద్దరిని కాసేపు ఒంటరిగా వదిలేయాలంటూ శివాజీ మిగిలిన ఇంటి సభ్యులను బయటకు తీసుకెళ్లారు. దీంతో ఈ జంట కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న అమర్‌దీప్.. అనంతరం ఇంటి సభ్యుల ముందు కేక్ కట్ చేసి భార్యకి తినిపించాడు. భార్యాభర్తలిద్దరూ ప్రేమతో కిస్ పెట్టుకుని రొమాంటిక్‌గా డ్యాన్స్ చేశారు.
ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడింది తేజస్విని. మా ఆయన చిన్న పిల్లోడు లాంటోడు.. మనసులో ఏం పెట్టుకోవద్దు. అందరూ బాగా ఆడాలంటూ కంటెస్టెంట్స్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పి వీడ్కోలు పలికింది. అనంతరం శోభాశెట్టి తల్లి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూడగానే శోభ కేకలు పెడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం తల్లిని కౌగిలించుకుని ఏడ్చేసింది. ఆ తర్వాత ఒక్కొ కంటెస్టెంట్‌ని కూడా ఆమె ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రిన్స్ యావర్ దగ్గరకి వెళ్లి.. ఓ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు శోభా తల్లిగారు. అది చూడగానే ప్రిన్స్ యావర్ గట్టిగా అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందులో ప్రిన్స్ యావర్ తల్లి ఫోటో వుంది. తన తల్లిని చూసుకున్న ప్రిన్స్ ..శోభ అమ్మ గారి కాళ్లకు మొక్కాడు. దీంతో ఆమె ప్రిన్స్‌ని దగ్గరకు తీసుకుని నువ్వు నా కొడుకువి.. ఏడవకూడదు అంటూ ఓదార్చింది.
తర్వాత కూతురిని దగ్గరకి పిలిచిన ఆమె.. నీ కోపం నాకు తెలుసు, నీకు తెలుసు.. వీళ్లకి ఏం తెలుసు అంటుంది. మీకు తెలుగు రాదని శోభ చెప్పిందని.. కానీ తెలుగు బాగానే మాట్లాడుతున్నారని అశ్విని అంటుంది . రోజూ తెలుగు చూస్తాను కదా అని ఆమె ఆన్సర్ ఇచ్చారు. వెళ్తూ వెళ్తూ తనకు ఈ అవకాశం కల్పించిన బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పి.. నువ్వు బాగా ఆడాలి, కప్పు తీసుకుని రావాలి అంటూ కూతురికి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లుగా ఓ ముద్దు పెట్టగా.. శోభ తన తల్లి వద్ద ఆశీర్వాదం తీసుకుంటుంది.
శోభ మదర్ వెళ్లిపోయాక.. ఎవరు వస్తారోనని గేట్ వైపు ఆసక్తిగా చూస్తుంటారు ఇంటి సభ్యులు. బిగ్‌బాస్ కూడా తలుపులు తెరవడం , మూయడం చేస్తూ ఆటపట్టిస్తాడు. యావర్ అయితే గేట్ దగ్గర తొంగి చూస్తూ వుంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే ‘‘యావు మేర బచ్చా’’ అని వాయిస్ వినిపిస్తుంది. అది ప్రిన్స్ యావర్ వాళ్ల బ్రదర్ వాయిస్. కానీ తన భయ్యా ఎక్కడా కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతుకుతూ వుంటాడు. యాక్టివిటీ రూమ్ నుంచి వచ్చిన తన అన్నయ్యను పరిగెత్తుకుంటూ వెళ్లి హగ్ చేసుకుని ఏడ్చేశాడు ప్రిన్స్ యావర్. అనంతరం యావర్ బ్రదర్.. హౌస్‌మేట్స్ అందరికీ నమస్కారం చెబుతాడు. యావర్ వాళ్ల అమ్మను మిస్ అవుతున్నాడని.. వాడికి అమ్మ ప్రేమ ఎలా వుంటుందో తెలియదని చెప్పడంతో ప్రిన్స్ కంటతడి పెట్టుకుంటాడు. ఫైట్ చేయ్యాలని కప్ కొట్టాలని తమ్ముడిని మోటివేట్ చేసేలా మాట్లాడతాడు యావర్ బ్రదర్. చిన్నప్పుడే అమ్మ మరణించడంతో యావర్‌ను అన్నయ్యే పెంచాడట. అలాంటి అన్నయ్య రాసిన లెటర్‌ను తేజ కోసం త్యాగం చేస్తూ ప్రిన్స్ చాలా బాధపడ్డ విషయం తెలిసిందే. అనంతరం యావర్ బ్రదర్ అందరికీ వీడ్కోలు పలికి బయల్దేరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com