Bigg Boss 7 Telugu : అలసిపోయానన్న ప్రియాంక, బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా ప్రిన్స్ యావర్

  • IndiaGlitz, [Saturday,October 14 2023]

బిగ్‌బాస్‌లో 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు హౌస్‌లో మంచి వినోదాన్ని అందిస్తున్నారు. పోటుగాళ్లుగా బిగ్‌బాస్ చేత అనిపించుకున్న వీళ్లు అలాగే దూసుకెళ్తున్నారు. అయితే తొలుత వీరి ధాటికి కాస్త వెనుకబడినప్పటికీ.. ఆటగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అమర్‌దీప్ చౌదరి మంచి ఫామ్‌లోకి వచ్చాడు. నిన్న ఇచ్చిన టాస్క్‌లో అదరగొట్టి జట్టును గెలిపించాడు . అలాగే పోయిందనుకున్న కెప్టెన్సీ మళ్లీ తిరిగి రావడంతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ ఆనందం రెట్టింపయ్యింది. సెకండ్ కెప్టెన్సీ కోసం నిర్వహించిన టాస్కుల్లో ఆటగాళ్లు, పోటుగాళ్లు సమంగా నిలిచారు.

హౌస్‌లోకి వచ్చిన నాటి నుంచి ఇంటి సభ్యుల కోసం కిచెన్‌లో కష్టపడుతున్నప్పటికీ తనకు ఎవరూ హెల్ప్ చేయడం లేదంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో అయితే ఎంతైనా చేయొచ్చు.. కానీ ఇది బిగ్‌బాస్. ఇంతమంది కోసం ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నా.. నేనింక అలసిపోయానంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మాటలు, అవమానాలు తప్పడం లేదంటూ ప్రియాంక కంటతడి పెట్టింది. ఈ క్రమంలోనే ప్రిన్స్ యావర్‌తో గొడవ పెట్టుకుంది.

అనంతరం బిగ్‌బాస్.. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అదే ‘‘హూ ఈజ్ ద బెస్ట్’’. దీనిలో భాగంగా ఫుట్‌బాల్‌ను చేతులతో గోల్‌పోస్టులో వేయాల్సి వుంటుంది. రెండు జట్ల నుంచి నలుగురు సభ్యులు ఈ గేమ్‌లో పాల్గొన్నారు. ఆటగాళ్ల వైపు నుంచి యావర్, పోటుగాళ్ల వైపు నుంచి అర్జున్ హోరాహోరిగా తలపడగా.. చివరికి విజయం ఆటగాళ్లనే వరించింది. దీంతో ఆటగాళ్లు కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్ కావాలనే దానిని నిర్ణయించే బాధ్యత పోటుగాళ్ల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. దీని ప్రకారం ఆటగాళ్లు టీమ్‌లోని అందరికీ బెలూన్స్ వుంటాయి. పోటుగాళ్లు .. ఆటగాళ్ల టీమ్‌లో ఒకరికి సూది ఇస్తారు. దీనిని అందుకున్న వారు.. కెప్టెన్‌గా అర్హత ఎవరికి లేదు అని భావిస్తారో వారి బెలూన్‌ని గుచ్చాలి.

చివరికి రేసులో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ మిగిలారు. బజర్ మోగానే పోటుగాళ్ల టీంలో ఒకరు సూదిని తీసుకుని, ఇద్దరిలో ఒకరి బెలూన్‌ పగులగొట్టి మరొకరిని కెప్టెన్‌ని చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. బజర్ మోగగానే నయని పావని సూది అందుకుని, పరుగున వెళ్లి తేజ బెలూన్ పగులగొట్టింది. దీంతో ప్రిన్స్ యావర్ బిగ్‌బాస్ 7 తెలుగులో సెకండ్ కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీ బ్యాడ్జిని ప్రిన్స్‌కు అందించాడు.

More News

Let's Metro For CBN: 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో ఉద్రికత్త.. మియాపూర్ మెట్రో స్టేషన్ మూసివేత

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసుతో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో "లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్" కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

IAS and IPS officers:కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల జాబితా ఇదే..

తెలంగాణలో ఎన్నికల విధుల నుంచి కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే.

Gudivada Amarnath:చంద్రబాబుకు పంపే ఇంటి భోజనంపై అనుమానాలున్నాయి.: మంత్రి అమర్నాథ్

జైలులో ఉన్న చంద్రబాబుకు కుటుంబసభ్యులు పంపుతున్న భోజనంపై తమకు అనుమానం ఉందంటూ  ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vrushabha:మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో 'వృషభ'..  ముంబైలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'...

DSC Exam:తెలంగాణలో నిరుద్యోగులకు బ్యాడ్ న్యూస్.. డీఎస్సీ పరీక్ష వాయిదా

తెలంగాణలో నిరుద్యోగులకు మరో నిరాశ ఎదురైంది. ఇప్పటికే గ్రూప్2 పరీక్షలు వాయిదా పడగా.. తాజాగా డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.