Bigg Boss 7 Telugu : నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. గౌతమ్ మీదకు దూసుకెళ్లిన ప్రిన్స్ యావర్ , శివాజీ ఆపకుంటే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు నాలుగో వారంలోకి ప్రవేశించింది. గతవారం దామిని ఎలిమినేట్ అయ్యింది. నిజానికి ఆమె ఎలిమినేషన్ ఊహించిందే. డేంజర్ జోన్‌లో వున్న శుభశ్రీ, దామినిలలో ఒకరు ఇంటిని వీడాల్సి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలా ఆ ఒక్కరు దామిని అయ్యారు. ఇక సోమవారం కావడంతో హౌస్‌లో నామినేషన్స్ రచ్చ నడిచింది. శుభశ్రీ, రతిక.. యావర్ , గౌతం కృష్ణల మధ్య వాదనలు కొట్టుకునే వరకు వెళ్లాయి. తాము నామినేట్ చేయదలచుకునే సభ్యులను బోనులో నిలబెట్టి, తమ వాదనలు వినిపించాలని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే జ్యూరీ సభ్యులైన శోభాశెట్టి, సందీప్, శివాజీలను వారు మెప్పించాల్సి వుంటుంది. అప్పుడే బోనులో వున్న కంటెస్టెంట్లు నామినేట్ అవుతారు.
ఆదివారం నాటి ఎపిసోడ్‌లో రతిక, పల్లవి ప్రశాంత్‌లను ఉద్దేశించి శివాజీని నాగ్ అడిగిన విషయాలు ఇవాళ కూడా డిస్కషన్ నడిచింది. ముఖ్యంగా రతిక, శివాజీ మధ్య తారాస్థాయిలో వాగ్వాదం నడిచింది. నాగార్జున ముందు మీరు ఎందుకు అలా అన్నారు అని రతిక ప్రశ్నించింది. దీనికి శివాజీ స్పందిస్తూ.. నేను లేకపోతే, ఆయన వీడియోలు వేసి చూపిస్తే నీ పరిస్ధితి ఏంటి అని కౌంటర్ వేశాడు. అది కాదన్నా.. ఇది కాదన్నా అని రతిక చెబుతూ వుండగా.. నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావ్, నీకు సారి చెప్పా గుర్తు లేదా అంటూ శివాజీ చెప్పాడు.
ఆ తర్వాత నామినేషన్స్‌లో భాగంగా ప్రిన్స్ యావర్.. తాను ప్రియాంక, టేస్టీ తేజాలను నామినేట్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. పవర్ అస్త్ర టాస్క్‌లో తనను పక్కకు తప్పించిన విషయాన్ని యావర్ ప్రస్తావించాడు. తాను కోపంగా వున్నప్పుడు ఎవరిని హర్ట్ చేయలేదని, తాను డ్యామేజ్ చేసింది బిగ్‌బాస్ ప్రాపర్టీ అని చెప్పాడు. టేస్టీ తేజ టాస్క్‌లు సరిగా ఆడటం లేదని ప్రిన్స్ వాదించాడు. దీనికి తేజ కూడా గట్టిగానే బదులిచ్చాడు. బీస్ట్ టాస్క్‌లో నీ కంటే నేనే బాగా ఆడానని, అలాగే పవర్ అస్త్ర టాస్క్‌లో నీ ముఖం మీద నీళ్లు కొట్టానని గుర్తుచేస్తూ.. ఇది ఫిజికల్ కాదా అని ప్రశ్నించాడు.
ఆ తర్వాత ప్రిన్స్ యావర్ , గౌతమ్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. తన మీద కేకలు వేశాడని, తనను తక్కువ చేసి మాట్లాడాడని గౌతమ్ కారణం చెప్పాడు. ఇది నా యాటిట్యూడ్ అని , తాను ఇక్కడికి ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి వచ్చానని ప్రిన్స్ బదులిచ్చాడు. అయితే ఎదుటివాళ్లను హర్ట్ చేయడం నీ ఐడెంటిటీనా అని గౌతమ్ కౌంటర్ వేశాడు. నేను నిన్న ఏం హర్ట్ చేశానో చెప్పాలని ప్రిన్స్ నిలదీశాడు. దీనికి సహనం కోల్పోయిన గౌతమ్ వెక్కిరించడం మొదలుపెట్టాడు. అది తట్టుకోలేకపోయిన యావర్ బోనులోంచి దిగి గౌతమ్ మీదకు దూసుకొచ్చాడు. ఒకానొక దేశలో ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్లింది. అయితే జడ్జిలు కలగజేసుకోవడం వ్యవహారం సద్దుమణిగింది. అలాగే గౌతమ్ చెప్పిన కారణం సరిగా లేదన్న జడ్జిలు ప్రిన్స్‌ను నామినేషన్స్ నుంచి తీసేయమని చెప్పారు. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్‌గా సాగినట్లుగా తెలుస్తోంది. రేపటికి ఎవరు ఎవరిని నామినేట్ చేశారో క్లారిటీ రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments