Bigg Boss 7 Telugu : ప్రేమ పాఠాలు చెప్పిన శుభశ్రీ.. దోస్త్ మేరా దోస్త్ అంటున్న తేజ - ప్రిన్స్ యావర్
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగులో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం టాస్క్‌లు నడుస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన టాస్క్‌ల్లో శివాజీ, పల్లవి ప్రశాంత్ జోడి ఐదు స్టార్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇవాళ మాత్రం ప్రేక్షకులకు ఫన్ అందించాలని బిగ్‌బాస్ నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా ఎన్నిసార్లు చెప్పినా హౌస్‌లో ఇంగ్లీష్ లేదంటే హిందీలో మాట్లాడుతున్న ప్రిన్స్ యావర్‌ను సెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. మధ్యలో తేజని కూడా లాగాడు. టాస్క్‌లో భాగంగా ప్రిన్స్ యావర్‌కి ఇంటి సభ్యులంతా ఐదేసి తెలుగు పదాలు నేర్పించాలి.. తేజ అతడికి టీచర్‌గా వ్యవహరించాలి. ఒకవేళ గనుక యావర్ ఇంగ్లీష్‌లో మాట్లాడితే తేజని శిక్షించుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.
అలా ఒక్కొక్కరు ప్రిన్స్ యావర్‌కు బిగ్‌బాస్ అప్పగించిన పని పూర్తి చేశారు. అయితే శుభశ్రీ మాత్రం ప్రేమ పాఠాలు చెప్పడం మొదలెట్టింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఈ పదాన్ని తెలుగులో చెప్పాలంటూ ప్రిన్స్‌ని అడిగింది. అంతేకాదు.. తన చీర కొంగుని అతనికి ఇచ్చి రెచ్చగొడుతున్నట్లుగా వ్యవహరించింది. దీంతో ఇంటి సభ్యులంతా షాక్ అయ్యారు. ఇక తేజ మరోసారి ఇంటిలో నవ్వులు పంచాడు. నువ్వు ఈ టాస్క్‌లో సరిగా ఆడకపోతే.. మూడు స్టార్లు తీసుకురాకుంటే నేను నీతో ఏమంటాను అని తేజ అడుగుతాడు. ఆ వెంటనే తేజ కట్టుకున్న పంచను లాగి అక్కడి నుంచి పారిపోయాడు యావర్. ఈ అల్లరికి కంటెస్టెంట్స్ పడి పడి నవ్వారు.
అలా ఫన్‌గా సాగుతున్న దశలో ఇంటిని ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. హౌస్ మెంబర్స్‌కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు వచ్చాయి. అయితే దీనిని ఓ టాస్క్‌గా మార్చేశాడు బిగ్‌బాస్. దీనికి ‘చిట్టి ఆయిరే’ అని పేరు పెట్టి.. ప్రస్తుతం కంటెస్టెంట్స్‌లో పెయిర్‌లుగా వున్న వారిలో ఒకరికి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన ఉత్తరాలు చదివే ఛాన్స్ వుంటుందని , ఇందుకోసం మరొకరు త్యాగం చేయాల్సి వుంటుందని చెప్పాడు. అంతేకాదు.. త్యాగం చేసిన వాళ్లు ఉత్తరాలు చదవకపోగా, కెప్టెన్సీ టాస్క్‌లో కంటెండర్స్‌గా పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. లెటర్ చదివిన వారికి మాత్రం కంటెండర్స్‌గా అర్హత సాధిస్తారని చెప్పారు.
టాస్క్ మొదలయ్యాక.. శుభశ్రీ-గౌతమ్ జంట ఉత్తరాల దగ్గరికి వెళ్లి గొడవపడ్డారు. చివరిగా తాను లెటర్ చదువుతానని, కెప్టెన్సీ టాస్క్‌లో విజయం సాధిస్తానని , దీని ద్వారా శుభశ్రీని నామినేషన్స్ నుంచి రక్షిస్తానని డీల్ సెట్ చేసుకున్నాడు. దీంతో శుభశ్రీ త్యాగం చేసి కంటతడి పెట్టుకుంది. తర్వాత టేస్టీ తేజ-యావర్ జోడీ లెటర్స్ దగ్గరకు వెళ్లగా.. యావర్ కోసం తాను త్యాగం చేస్తానని చెప్పాడు. కానీ ఇద్దరు నేను త్యాగం చేస్తానంటే నేను త్యాగం చేస్తానని లెటర్స్ చించే ప్రయత్నం చేశారు. చివరికి తేజ తన తండ్ర పంపిన లెటర్ చదివి వెక్కి వెక్కి ఏడ్చాడు. అలా తొలిసారిగా కంటెండర్‌షిప్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇవాళ జరిగిన టాస్క్‌లో తేజ, గౌతమ్‌లు కెప్టెన్సీ కంటెండర్‌లుగా అర్హత సాధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com