Bigg Boss Telugu 7 : బిగ్‌బాస్ నాకు రెండో తల్లి అన్న యావర్ .. రైతు గర్వపడేలా చేస్తానన్న ప్రశాంత్ , ఇద్దరూ ఏడిపించేశారుగా
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా.. అర్జున్, అమర్దీప్, శివాజీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లు ఫినాలే వీక్‌లో అడుగుపెట్టినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఈ వారం ఎలాంటి నామినేషన్స్, గేమ్స్, టాస్క్‌లు లేకుండా కంటెస్టెంట్స్‌ని ఫ్రీగా వదిలేశాడు బిగ్‌బాస్. ఇన్ని రోజుల జర్నీలో వారు సాధించినది, తీపి గుర్తులు, సంతోషం, బాధ అన్నింటిని గుర్తుచేస్తున్నాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా అమర్దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక, శివాజీలు హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి తమ జర్నీని చూసుకున్నారు. ఇవాళ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లకు అవకాశం కల్పించారు బిగ్‌బాస్.
తొలుత యావర్‌ను గార్డెన్ ఏరియాలోకి పిలిచి తన జ్ఞాపకాలను రీవైండ్ చేశారు బిగ్‌బాస్. ఆ ఫోటోలు చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. తన సోదరుడి ఫోటో చూసి ప్రిన్స్ యావర్ ఎమోషనల్ అయ్యాడు. తర్వాత యాక్టివిటీ ఏరియాలో యావర్ పోరాటాన్ని, ప్రతిభను మెచ్చుకుంటూ ఆయనను ఆకాశానికెత్తేశాడు బిగ్‌బాస్. పరిచయం లేని మనుషుల మధ్య భాష రాకపోయినా ఇంట్లోకి అడుగుపెట్టారు. యావర్‌తో పోటీ అంటే అందరూ ఆలోచించేలా చేశారు. ఆరో వారంలోనే కెప్టెన్‌గా నిలిచారని.. తప్పు కనిపించిన ప్రతి చోటా మీ కోపం, పట్టుదలలు కూడా కనిపించాయని బిగ్‌బాస్ పేర్కొన్నారు. ఆ ధైర్యమే ఎవిక్షన్ పాస్ సాధించేలా చేసిందని, అయినప్పటికీ దానిని సరెండర్ చేసి నీతిగా గెలవాలనే క్యారెక్టర్ అందరికీ నచ్చిందని బిగ్‌బాస్ ప్రశంసించారు. ఈ పోజిషన్లో మీరు నిలబడ్డారంటే ప్రేక్షకులు మిమ్మల్ని ఎంత ప్రేమించారో... ఈ ప్రేమ ఇలాగే కొనసాగాలని బిగ్‌బాస్ ఆకాంక్షించారు.
దీనికి బాగా ఎమోషనలైన ప్రిన్స్ యావర్.. తనకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పాడు. తాను హైదరాబాద్ బిడ్డ కాదు.. కోల్‌కతా బిడ్డను కాదు.. నేను నీ బిడ్డను అని వ్యాఖ్యానించాడు. జీవితంలో తాను నిలబడితే ఇంకొకరిని కూడా తనతో పాటు నిలబెడతానని ఇది యావర్ అంటే అన్నాడు. మీ వల్లే నేను ఇక్కడ వున్నాను.. అందుకే బిగ్‌బాస్ మా రెండో అమ్మవి. ప్రేక్షకులకు థన్యవాదాలు చెబుతూ.. ఇక తన వద్ద మాటలు లేవని ఏడుస్తూ ముగించాడు ప్రిన్స్ యావర్.
ఇక చివరిగా పల్లవి ప్రశాంత్‌ను పిలిచాడు బిగ్‌బాస్. మెడలో కండువా వేసుకుని గార్డెన్ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన జర్నీ ఫోటోలను చూసుకుని సంబరపడిపోయాడు. ముఖ్యంగా తన తండ్రితో వున్న ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యాక్టివిటీ ఏరియాలో ప్రశాంత్‌ను ఆకాశానికెత్తేశాడు బిగ్‌బాస్. సామాన్యుడి కోటాలో ఇక్కడ అడుగుపెట్టిన మీకు.. సరైన దిశలో నడిపే బంధం దొరికింది. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు దొరికిని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్కుల్లో గెలవడానికి రక్తాన్ని సైతం చిందించేందుకు వెనుకాడలేదు. ఈ తెగింపే మిమ్మల్ని ఈ సీజన్‌కు తొలి కెప్టెన్‌ను చేసిందని ప్రశాంత్‌ను బిగ్‌బాస్ ప్రశంసించారు. సామాన్యుడైనా ధైర్యం వుంటే ఏమైనా సాధించొచ్చు అని నిరూపించారు అని ప్రశాంత్‌కు కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో బాగా ఎమోషనలైన పల్లవి ప్రశాంత్.. రైతు ముఖంలో చిరునవ్వు కోసమే ఇంత దూరం వచ్చానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ రైతుబిడ్డలమని గర్వంగా చెప్పుకునే రోజును తీసుకొస్తానని చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments