కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రమ్ ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్ స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు.
తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఒన్ లో కంటెంస్టెంట్ గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ కు ఈ కథ గ్రాండ్ రీ లాంచింగ్ గా ఉండబోతోంది. ఒకరకంగా ఈ మూవీతో ప్రిన్స్ సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ మార్చుకున్నాడు. లుక్ లో చేంజెస్ కోసం ప్రయత్నించాడు. అలాగే ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.
ఈ కథకు అవసరమైనట్టుగా తనను తాను మార్చుకుని ప్రిన్స్ నటిస్తోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతోంది. ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.ఇక ఈ మూవీ లఢక్, గోవా, హైదరాబాద్ తో పాటు వారణాసి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగబోతోంది. గతంలో 'సూపర్ స్టార్ కిడ్నాప్' అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఏ. సుశాంత్ రెడ్డి మరోసారి తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. అతి త్వరలో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ఆ వెంటనే రెగ్యులర్ షూట్ కు వెళుతుంది.
వి కృష్ణారావు కొల్లూరి సమర్మిస్తోన్న ఈ చిత్రం ‘సోరింగ్ ఎలిఫెంట్’ బ్యానర్ పై రూపొందబోతోంది. ఈ చిత్రానికి కెమెరామెన్ : సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, పి.ఆర్.వో: జి.ఎస్. కె మీడియా, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్ కుమార్, నేతి పద్మాకర్, నిర్మాత, దర్శకత్వం : ఏ సుశాంత్ రెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com