యాంకర్ ప్రదీప్ పై పంచ్ వేసిన ప్రిన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా ప్రమోషన్స్ అదరగొట్టేస్తున్నారు. బ్రహ్మోత్సవం ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ యాంకర్ ప్రదీప్ నిర్వహిస్తున్న కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను షోలో పాల్గొన్నారు. మహేష్ ఇలా ఓ షోలో పాల్గొనడం అనేది ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం.ఈ ప్రొగ్రామ్ లో మహేష్ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు.
ఇంతకీ మహేష్ చెప్పిన ఇంట్రస్టింగ్ విషయాలు ఏమిటంటే... మహేష్ చిన్నప్పుడు దేవి ధియేటర్లో టిక్కెట్ల కోసం క్యూలో నిలబడ్డాట...వంట గదిలో గరిట ఎప్పుడైనా తిప్పారా అని అడిగితే...నాకే కాదు మా ఆవిడకు కూడా ఆ అలవాటు లేదు అదే హైలైట్ అని చెప్పారు. ఇలా చాలా విషయాలు చెప్పారు. చివరలో నువ్వు సినిమాలు చేయద్దమ్మా..నీకు ఈ షోయే కరెక్ట్ అంటూ ప్రదీప్ పై పంచ్ వేసేసాడు ప్రిన్స్ మహేష్. ప్రదీప్ మహేష్ ల కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను స్పెషల్ ప్రొగ్రామ్ ఈ నెల 22న రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com