మోడీ కేబినెట్ విస్తరణ: కిషన్ రెడ్డికి ప్రమోషన్.. ఆ 43 మంది వీరే!
Send us your feedback to audioarticles@vaarta.com
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి తన కేబినెట్ ని విస్తరిస్తున్నారు. భారీ మార్పులతో మోడీ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో 43మంది నేతలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
వీరిలో చాలా మంది కొత్తవారే ఉండబోతున్నారు. కొత్త శాఖలకు మంత్రులు రాబోతున్నారు. తెలంగాణ బిజెపి నేత కిషన్ రెడ్డి ఇప్పటి వరకు హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయనకు ప్రమోషన్ లభించబోతున్నట్లు తెలుస్తోంది.
కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి.. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ భాద్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న 43 మంది ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు.
మోడీ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న 43 మంది నేతల జాబితా ఇదే..
1. నారాయణ్ రాణే
2. సర్బానంద సోనోవాల్
3. డా. వీరేంద్ర కుమార్
4. జ్యోతిరాదిత్య సింధియా.
5. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్.
6. అశ్విని వైష్ణవ్.
7. పశుపతి కుమార్ పరాస్
8. కిరెన్ రిజిజు
9. రాజ్ కుమార్ సింగ్.
10. హర్దీప్ సింగ్ పూరి.
11. మన్సుఖ్ మాండవియా.
12. భూపేందర్ యాదవ్.
13. పురుషోత్తం రూపాల.
14. జి. కిషన్ రెడ్డి.
15. అనురాగ్ సింగ్ ఠాకూర్.
16. పంకజ్ చౌదరి.
17. అనుప్రియా సింగ్ పటేల్.
18. డా. సత్య పాల్ సింగ్ బాగెల్.
19. రాజీవ్ చంద్రశేఖర్.
20. శోభా కరంద్లాజే.
21. భాను ప్రతాప్ సింగ్ వర్మ.
22. దర్శన విక్రమ్ జర్దోష్
23. మీనాక్షి లేకి.
24. అన్నపూర్ణ దేవి.
25. ఎ. నారాయణస్వామి.
26. కౌషల్ కిషోర్.
27. అజయ్ భట్.
28. బిఎల్ వర్మ.
29. అజయ్ కుమార్.
30. చౌహాన్ దేవ్ సింగ్.
31. భగవంత్ ఖుబా.
32. కపిల్ మోరేశ్వర్ పాటిల్.
33. ప్రతిమ భౌమిక్
34. సుభాస్ సర్కార్.
35. డి.ఆర్. భగవత్ కృష్ణారావు కరాడ్.
36. డి.రాజ్‌కుమార్ రంజన్ సింగ్.
37. భారతి ప్రవీణ్ పవార్.
38. బిశ్వేశ్వర్ తుడు.
39. శాంతను ఠాకూర్.
40. ముంజపారా మహేంద్రభాయ్.
41. జాన్ బార్లా.
42. ఎల్. మురుగన్.
43. నిశిత్ ప్రమాణిక్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout