PM Modi: అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో బాలరాముడికి ప్రాణప్రతిష్ట..

  • IndiaGlitz, [Monday,January 22 2024]

ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు కాసేపట్లో మోక్షం లభించనుంది. వేల మంది సమక్షంలో ప్రధాని మోదీ అయోధ్య బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ట చేయనున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా రామాయణ ఇతిహాసంతో ముడిపడి ఉన్న ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ నుంచి అయోధ్య చేరుకున్న మోదీ సాయంత్రం 4గంటల వరకు అక్కడే ఉండనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజిత్ ముహూర్తంలో కాశీ పండితుడు గణేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాణప్రతిష్ఠకు శుభ ముహూర్తమైన 84 సెకన్లలో మోదీ.. రామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్ఠాపన చేస్తారు.

ప్రధాని మోదీ అయోధ్య షెడ్యూల్..

ఉదయం 10.55 గంటలకు రామ మందిరానికి చేరుకున్నారు.

మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

12.20 గంటలకు రాముడి కళ్లకు గంతలను ప్రధాని మోదీ తొలగించి బాలరామునికి హారతి ఇస్తారు.

శ్రీరాముని దర్శనం అనంతరం మధ్యాహ్నం 1.00 గంటకు వేదిక నుంచి బయలుదేరుతారు.

అనంతరం అక్కడే జరిగే సభలో యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్‌లతో కలిసి పాల్గొని ప్రసంగిస్తారు.

మ. 2.15గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో దర్శనం అనంతరం.. పూజలు చేస్తారు.

మ. 2.35 గంటలకు అయోధ్యలోని హెలిప్యాడ్ వద్దకు మోదీ చేరుకుంటారు.

మ.3.05 గంటలకు అయోధ్య నుంచి మోదీ బయలుదేరుతారు.

సాయంత్రం 4.25 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.

ఇక రేపటి నుంచి భక్తులకు అయోధ్య రాముని దర్శనం లభించనుంది. రెండు స్లాట్లుగా విభజించి దర్శన సమయాలను నిర్ణయించారు. ఉదయం 7గంటల నుంచి 11.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7గంటల వరకు దర్శన సమయం ఉంటుంది. ప్రతీరోజూ మూడు హారతులు ఇవ్వనున్నారు. ఉదయం 6.30 గంటలకు శృగార హారతి, మధ్యాహ్నం 12గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఇస్తారు.

More News

దళితులపై మరోసారి వివక్ష.. అంబేద్కర్‌పై విషం వెళ్లగక్కిన పెత్తందార్లు..

దళితులు అంటే పెత్తందారులకు ఎంత చులకనో మరోసారి బహిర్గతమైంది. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఆవిష్కరించారు.

Ram Mandir: రాములోరి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు ఎవరంటే..?

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన సంప్రదాయ క్రతువులు జరుగుతున్నాయి.

YS Jagan: అంటరానితనం రూపు మార్చుకుంది.. సీఎం జగన్ ప్రసంగంపై ప్రశంసలు..

విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. దేశంలోనే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహంగా పేరు గడించింది.

KTR:కరెంట్ బిల్లులు కట్టకండి.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Kalki 2898 AD:ప్రభాస్ 'కల్కి' సినిమాలో రౌడీ హీరో విజయ్ గెస్ట్ రోల్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కల్కి2898AD'.