Modi: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం

  • IndiaGlitz, [Saturday,November 25 2023]

తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులకు కూడా సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మోదీ నిర్ణయంతో ఎమ్మార్పీస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కనుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాదిగల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే వీరికి ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ అందుతాయి.

నవంబర్ 11న హైదరాబాద్‌లో జరిగిన సభలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీని నియమిస్తున్నట్లుగా అదేశాలు జారీ చేశారు.

అయితే ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పోలింగ్‌కు నాలుగు రోజుల మందు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అటు రైతుబంధు నిధులకు గ్రీన్ సిగ్నల్.. ఇటు ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటుచేయడం చూస్తుంటే తాము ఆరోపిస్తున్నట్లు బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా ఇప్పటికే ప్రజలకు రెండు పార్టీలు ఒక్కటేననే విషయం బలంగా వెళ్లిందని.. కాంగ్రెస్ గెలుపును ఆపలేరని పేర్కొంటున్నారు.

More News

Rythubandhu: రైతుబంధు నిధుల విడుదల.. బీఆర్ఎస్‌కు లాభం చేకూరనుందా..?

తెలంగాణ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట దక్కింది. రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Koose Munisamy Veerappan:ZEE5 తమిళ్ ఒరిజినల్ డాక్యుమెంట్ సిరీస్ ‘కూసే మునస్వామి వీరప్పన్’ తెలుగు ట్రైలర్ విడుదల

నవంబర్ 24, నేషనల్: పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ మన దేశంలోనే అతి పెద్దదైన ఓటీటీ మాధ్యమంగా రాణిస్తోంది ZEE5.

Hi Nanna:లవ్, ఎమోషన్, సెంటిమెంట్‌.. 'హాయ్ నాన్న' ట్రైలర్ వచ్చేసింది..

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

చైనా నిమోనియా వైరస్ ముప్పు భారత్‌కు తక్కువే: కేంద్రం

ప్రపంచాన్ని అల్లకలోల్లం చేసిన కరోనా మహమ్మారి సృష్టించిన మారణహోమం నుంచి పూర్తిగా బయటపడకముందే చైనాలో

Barrelakka:బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ శిరీషకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.