Modi: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందేలా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియకు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేబినెట్ సెక్రటరీతో పాటు ఉన్నతాధికారులకు కూడా సూచనలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మోదీ నిర్ణయంతో ఎమ్మార్పీస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కనుంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మాదిగల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ ప్రక్రియ అమల్లోకి వస్తే వీరికి ఉద్యోగాలు సహా ఇతర విషయాల్లో రిజర్వేషన్లు, ఇతర బెనిఫిట్స్ అందుతాయి.
నవంబర్ 11న హైదరాబాద్‌లో జరిగిన సభలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో ఓ కమిటీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వర్గీకరణ కోసం మందకృష్ణ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం కమిటీని నియమిస్తున్నట్లుగా అదేశాలు జారీ చేశారు.
అయితే ఎన్నికల్లో లబ్దిపొందేందుకే పోలింగ్‌కు నాలుగు రోజుల మందు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అటు రైతుబంధు నిధులకు గ్రీన్ సిగ్నల్.. ఇటు ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటుచేయడం చూస్తుంటే తాము ఆరోపిస్తున్నట్లు బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని చెబుతున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా ఇప్పటికే ప్రజలకు రెండు పార్టీలు ఒక్కటేననే విషయం బలంగా వెళ్లిందని.. కాంగ్రెస్ గెలుపును ఆపలేరని పేర్కొంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com