Modi:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన మోదీకి అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ జీయర్‌లు శ్రీవారి శేష వస్త్రంతో మోదీని సత్కరించారు. దర్శనానంతరం వకులామాత, విమాన వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపం వద్ద మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, డైరీ, క్యాలండర్‌లను అందించారు.
ఆలయంలోనే దాదాపు 50 నిమిషాల పాటు మోదీ గడిపారు. ప్రధాని పర్యటన కారణంగా కేంద్ర బలగాల నిఘాలో తిరుమల వెళ్లిపోయింది. ప్రధాని రాకకు రెండు గంటల నుంచి భక్త జన సంచారాన్ని నిలిపేశారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకాణాలను మూయించారు. రచన గెస్ట్ హౌస్‌కు చేరుకున్న మోదీ రోడ్డు మార్గం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌కు పయనమవుతారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రధాని హోదాలో మోదీ నాలుగో సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో 2015, 2017, 2019 సంవత్సరాల్లో స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు.
తిరుమలేశుడిని దర్శించుకున్నానని ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేశారు. 140కోట్ల మంది భారతీయులు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని వేంకటేశ్వరుడిని కోరుకున్నట్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com