Prime Minister Modi:హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా హాజరైన కార్యకర్తలు..

  • IndiaGlitz, [Monday,November 27 2023]

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‭లో ప్రధాని మోదీ నిర్వహించిన భారీ రోడ్ షో ముగిసింది. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో నారాయణగూడ, వైఎంసీఏ, కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు 3కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవున బీజేపీ-జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరై మోదీకి పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మోదీ కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో 25 వేదికలను ఏర్పాటుచేశారు. ఒక్కో వేదికపై ఒక్కో నియోజకవర్గ అభ్యర్థి నిలబడి.. మోదీకి తమ మద్దతు తెలపడం విశేషం.

గతంలో మోదీ ఇలాగే రెండుసార్లు రోడ్ షోలు నిర్వహించారు. ఒకటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. మరొకటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయాన్ని అందుకోగా.. కర్ణాటకలో మాత్రం ఓడిపోయింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరు జరగనున్న నేపథ్యంలో మోదీ రోడ్‌షో ఏమాత్రం కమలం పార్టీకి ఏమాత్రం ప్రయోజనం చేకూరుస్తుందో వేచి చూడాలి.

అంతకుముందు కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ హుజూరాబాద్‌ ప్రజలు గతంలోనే సీఎం కేసీఆర్‌కు ట్రైలర్‌ చూపించారని.. ఈ ఎన్నికల్లో ఆయనకు పూర్తి సినిమా చూపిస్తారని తెలిపారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తే సీఎం అవుతారని మరోసారి స్పష్టంచేశారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ కావాలని.. అలా జరగాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు.

More News

Arun Vikkirala:ప్రతీ ఒక్కరికీ నచ్చేలా తీశాను.. ‘కాలింగ్ సహస్ర’పై దర్శకుడు అరుణ్ విక్కిరాలా

బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’.

Aadudam Andhra: 'ఆడుదాం ఆంధ్రా' పోటీలకు రిజిస్ట్రేషన్లు షూరూ.. వివరాలు ఇవే..

సీఎం జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించేలా 'ఆడుదాం ఆంధ్రా' ప్రోగ్రామ్‌కు నడుం బిగించింది.

Election Campaign End:రేపటితో ముగియనున్న ప్రచారం.. నేతల సుడిగాలి పర్యటనలు..

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. కేవలం 48 గంటలు మాత్రమే ప్రచారానికి మిగిలింది.

Lokesh:మంత్రులకు కౌంట్‌డౌన్ మొదలైంది.. పాదయాత్రలో లోకేశ్‌ హెచ్చరిక..

వైసీపీ మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.

Harish Rao: మంత్రి హరీష్‌రావు అత్యుత్సాహమే కొంపముంచిందా..?

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసీ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.