Modi:అమృత భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు. ముందుగా ఇటీవల పునర్ నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి కూడా పాల్లొన్నారు. రైల్వే స్టేషన్‌ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించాఅయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు.రు.ఈ రెనోవేషన్ కోసం ప్రభుత్వం రూ.240కోట్లు ఖర్చు చేసింది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, వెయిటింగ్ హాల్స్, క్లాక్‌రూమ్స్‌తో పాటు ఫుడ్ ప్లాజాలు వంటివి ఏర్పాటు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్‌ని తీర్చి దిద్దడం విశేషం.
అనంతరం రెండు అమృత భారత్ రైళ్లతో పాటు ఆరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా ఊపారు. అనంతరం వందేభారత్ రైలు ఎక్కి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వెనువెంటనే నగరంలో నిర్మించిన మహార్షి వాల్మీకి విమానాశ్రయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సం కోసం అయోధ్యలో అడుగుపెట్టిన మోదీ రైల్వేస్టేషన్ వరకు 15 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన 1,400 మంది కళాకారులు తమ ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి అయోధ్య ధామ్ వరకు ఏర్పాటు చేసిన 40 స్టేజీలపై కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్య శ్రీరాముడి మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 22 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. గర్భగుడిలో పాలరాతితో నిర్మించి బంగారు పూత పూయించిన సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పు ఉన్న ఈ సింహాసనంపై రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అనంతరం గర్భగుడి వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుపుతారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments