Prime Minister Modi:బిహార్ సీఎం నితీశ్ కుమార్ 'సెక్స్' వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం

  • IndiaGlitz, [Wednesday,November 08 2023]

జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ సైతం నితీశ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని గుణలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ప్రతిపక్షాల అహంకార కూటమిలో పెద్దనేత అయిన నితీశ్.. మంగళవారం అసెంబ్లీలో మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలం ఉపయోగించారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా..? ఆ కూటమిలోని ఏ ఒక్కనేత కూడా నితీశ్‌ మాటలను ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గురించి ఇలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నవారు మీకు ఏదైనా మంచి చేయగలరా..? అని ప్రశ్నించారు. నితీశ్ ఇంకా ఎంతగా దిగజారిపోతారు..? అంటూ మోదీ ధ్వజమెత్తారు.

ఇటీవల బిహార్‌లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ బిహార్‌లో సంతానోత్పత్తి రేటు 4.2 నుంచి 2.9కి పడిపోయింది.. త్వరలోనే ఇది 2%కి తగ్గుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందని చెబుతూ షాకింగ్‌ కామెంట్లు చేశారు. భార్య చదువుకుంటే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసు. సంభోగం చివరలో ‘బయటకు తీసేయాలి’ అనే విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో క్షమాపణలు చెబుతున్నట్లు నితీశ్ తెలిపారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని.. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. దేశంలో స్త్రీ విద్య గురించి మాత్రమే తాను మాట్లాడానని.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాత్రం నితీశ్‌కి మద్దతుగా నిలిచారు. ఆయన కేవలం సెక్స్ ఎడ్యుకేషన్‌ గురించి మాత్రమే.. జనాభా నియంత్రణకు ప్రాక్టికల్‌గా ఏం చేయాలనేది వివరించారని.. ఇందులో తప్పేముందని వెల్లడించారు.

More News

Vande Sadharan Express:‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ ట్రయల్ రైన్ సక్సెస్.. త్వరలోనే ప్రయాణికులకు అంబాటులోకి..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం పడబోతుంది. సాధారణ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ తీసుకొస్తు్న్న ‘వందే సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Vande Sadharan express)

YS Jagan: ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణపై కోర్టు్ల్లో కదలిక మొదలైంది.

Vijayashanthi: రాములమ్మను బీజేపీ పక్కన పెట్టేసినట్టేనా..? పొమ్మనలేక పొగబెడుతున్నారా..?

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతున్నాయి. బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు ప్రచారం చేశారు.

Jana Sena, BJP:తెలంగాణలో కమలంతో జనసేన దోస్తీ.. మరి ఏపీలో పరిస్థితేంటి..?

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల నగారా మోగి ప్రచారం హోరెత్తుతుండగా..

Telangana High Court:అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య