వేయి స్థంబాల గుడిలో కామాంధ పూజారి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆడవారికి ఇంటా బయట రక్షణ లేదని.. కామాంధుల కాటుకు బలైపోతున్నారని మనం నిత్యం వార్తల్లో చూస్తుంటాం. పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా వెలుగుచూసిన ఘటనతో జనాలు విస్తుపోతున్నారు. అది కూడా గుడిలో ఈ ఘటన చోటుచేసుకోవడం.. బాధితురాలు మహిళా ఎస్సై కావడం గమనార్హం. ఇంతకీ ఆ ఘటనేంటి..? ఎక్కడ జరిగిందనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
తాకితే తాకించుకోవాలంతే..!
దైవానికి ప్రతిరూపంగా భావించే పూజారి ఆధ్యాత్మికంగా ఉండాల్సింది పోయి మహిళా పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం ఆలస్యం వెలుగుచూసింది. వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైతో దురుసుగా ప్రవర్తించడంతో బాధితురాలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లో కెళితే.. హన్మకొండ సీఐ దయాకర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో పోలీస్ బందోబస్తులో భాగంగా నగరంలోని ఓ మహిళా ఎస్సై వీఐపీ క్యూలైన్ వద్ద బందోబస్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పూజారి సందీప్ శర్మ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో కంగుతున్న మహిళా ఎస్సై, పూజారి వికృత చేష్టలను ప్రశ్నించగా.. ‘తాకితే తాకించుకోవాలి.. వేయిస్తంభాల ఆలయంలో పూజారులదే నడుస్తది, పూజారులను, తాకితేనే డ్యూటీ వేయించుకోవాలి. లేదంటే రావొద్దు’ అని దురుసుగా ప్రవర్తించాడు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అసభ్యంగా వ్యవహరించడంతో ఆవేదనకు గురైన బాధిత మహిళా ఎస్సై.. కీచక పూజారిపై చర్యలు తీసుకోవాలని హన్మకొండలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు సీఐ దయాకర్ మీడియాకు వెల్లడించారు.
గతంలోనూ ఇలాంటి ప్రవర్తనే..
కాగా.. ఈ పూజారిపై ఇలాంటి ఆరోపణలు.. ఇలాంటి ఘటనలకు పాల్పడటం కొత్తేమీ కాదు. గతంలో కార్తీక పౌర్ణమి రోజు బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో ఇదే పూజారి సందీప్ శర్మ అసభ్యకరంగా ప్రవర్తించారని పలువురు మహిళా కానిస్టేబుళ్లు ఆరోపించారు. విధుల్లో ఉన్న వారిని తాకుతూ..‘మీకు నేను అయ్యగారిని కాదు.. అన్నయ్యను కాదు’ అని ద్వందార్థాలతో మాట్లాడారని వారు వాపోయారు. వేయిస్తంభాల ఆలయంలోని పూజారుల నిర్వాహకంతో దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు, భక్తులు ఇబ్బందులకు గురువుతున్నారని, కీచక పూజారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు. మరి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పూజారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout