కలకలం రేపుతున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Saturday,July 27 2019]

టాలీవుడ్ నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమ్ వైసీపీ నేత పృథ్వీరాజ్ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ, రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టాలీవుడ్ పెద్దలు పట్టించుకోవట్లేదని.. పృథ్వీ కన్నెర్రజేసిన విషయం విదితమే. తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చిన ఆయన.. టాలీవుడ్ సినీ పెద్దలకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదన్నారు. సినిమా వాళ్లకు ఓట్లు వేయద్దని ఈ సందర్భంగా పృథ్వీ పిలుపునిచ్చారు. మరో 30 ఏళ్లపాటు అమరావతి గడ్డపై వైసీపీ జెండానే ఎగురుతుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నేనేం ట్రంక్ పెట్టెతో రాలే..!!

వైసీపీ ప్రచారం చేస్తే సినిమా ఛాన్స్‌లు రావని కొందరు అన్నారని.. అయినా తాను అవన్నీ పట్ట్టించుకోకుండా ముందుకెళ్లనన్నారు. ఎవరో అవకాశం కలిపిస్తారని తాను ట్రంక్ పెట్టెతో హైదరాబాద్‌కు రాలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలా.. ఎస్పీబీసీ ఛానల్‌కు కూడా పేరు తెస్తానని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చెప్పారు. అయితే ఈయన వ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా నారంగ్‌.. ఉపాధ్యక్షుడిగా దిల్‌రాజు

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన పాలకవర్గం ఖరారైంది. ప్రతి రెండేళ్లకోసారి ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఈసారి ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా ఏషియన్ సినిమాస్ అధినేత

ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో సి. కళ్యాణ్ ప్యానెల్ గెలుపు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ ఘన విజయం సాధించింది.

‘గుణ 369’ స్టోరీని సింగిల్‌ లైన్‌లో చెప్పేసిన నిర్మాతలు!

కార్తికేయ, అనఘా నటీనటులుగా అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన చిత్రం ‘గుణ 369’. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన చిత్రంలో కార్తికేయ సరికొత్త లుక్‌లో

ఫిల్మ్‌ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏసియన్ సినిమాస్ అధినేత

‘మా’(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్), నిర్మాతల మండలి ఎన్నికలు ఇలా వరుసగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందడి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు.

కొత్త కాన్సెప్ట్ సినిమాల‌ను ఆద‌రిస్తార‌ని `నేనులేను` విజ‌యంతో మ‌ళ్ళీ రుజువైంది - హీరో హ‌ర్షిత్‌

ఓ.య‌స్‌.యం విజన్ - దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`...