వెంకన్న సన్నిధిలో పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
‘సరస సంభాషణ’ దెబ్బకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అడ్రస్ లేకుండా పోయిన పృథ్వీ.. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా తాను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని పేర్కొన్నారు. 11 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డానన్నారు. తన శ్రమను గుర్తించి సీఎం జగన్ తనను ఎస్వీబీసీ చైర్మన్గా నియమించారన్నారు. ఏడాదిగా మద్యం, మాంసానికి దూరంగా ఉన్నానన్నారు. తన బ్లడ్ శాంపిల్స్ పరిక్షా నివేదికను సీఎంకు అందజేస్తానన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తానని హామీ ఇచ్చినందుకు తనపై కుట్ర చేశారని పృధ్వీ వాపోయారు.
సంచలన వ్యాఖ్యలు!
‘ఐదు నెలల పదవి కాలంలో నాకు 50 ఏళ్ల జీవితాన్ని చూపించారు. కుట్రపూర్వితంగా నన్ను ఎస్వీబీసీ నుంచి తప్పించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్న నమ్మకం ఉంది. రాజీనామా చేయ్యమని ఎవరూ నాపై ఒత్తిడి చేయలేదు. నేనే స్వచ్ఛందంగా చైర్మన్ పదవికి రాజీనామా చేశాను. నేను మరణించినా రానంతా ప్రచారాన్ని మీడియా ఇచ్చింది. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి అనారోగ్యానికి గురయ్యాను. నన్ను ఎస్వీబీసీ నుంచి పంపి కొందరు పైశాచిక అనందం పొందారు. సీఎం జగన్పై నాకు నమ్మకం ఉంది. సజ్జల, వైవి, విజయసాయిరెడ్డిలకు మాత్రమే నేను జవాబుదారిగా ఉంటాను’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ తరహాలో వెన్నుపోటు!
‘అమరావతికి వెళ్లిన సమయంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పాను. రాజధాని రైతులను కించపరుస్తూ నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. నేను ఏ సామాజిక వర్గాన్నీ టార్గెట్ చెయ్యలేదు. కొందరు పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతాను. 2014 వరకు నా సినీ జీవితం షెడ్యూల్ బిజీగా ఉంది. ఆ తరువాత నా చుట్టూ ఉండేవారే తనకు ఎన్టీఆర్ తరహాలో వెన్నుపోటు పొడిచారన్నారు.
లౌక్యం సినిమాలో నటించాను కానీ లౌక్యంగా ఉండలేకపోయాను..
అలా ఉండి ఉంటే 10 ఏళ్లపాటు ఎస్వీబీసీ చైర్మన్గా కొనసాగే వాడిని.
ఉగాది రోజున మంచి శుభవార్తతో మీ ముందుకు వస్తాను’అని పృథ్వీ వెల్లడించారు.
ఇంతకీ ఆ శుభవార్త ఏంటో..!?
ఉగాది రోజున మంచి శుభవార్తతో అనడంతో మళ్లీ ఆయన్ను చైర్మన్గా నియమిస్తారా..? లేకుంటే లేకుంటే మరో పదవి ఏమైనా ఇస్తారా..? అని అందరూ అనుకుంటున్నారు. ఒక వేళ ఆయనకు వేరే పదవి ఇస్తే ఏం ఇవ్వబోతున్నారు..? ఇంతకీ రాజకీయం పరంగా ఆ శుభవార్త ఉంటుందా లేక.. సినిమా పరంగా ఉంటుందా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ శుభవార్త ఏదో తెలియాలంటే ఉగాది వరకూ వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout